నేడు ఒంటిమిట్టలో కళ్యాణోత్సవం- కాలి నొప్పితో సీఎం జగన్ పర్యటన రద్దు..!!

ఒంటిమిట్ట రాములోరి కల్యాణవేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది.శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి కల్యాణం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరిక అంటారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం చేపడతారు. దాదాపు 70వేల మంది స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాటుచేశారు. కళ్యాణానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉన్నా..కాలి నొప్పితో పర్యటనతో రద్దు అయింది.

ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖద్వారాన్ని భారీసెట్టింగులతో ఏర్పాటుచేశారు. సాంప్రదాయబద్దంగా ఏర్పాటుచేసిన ఈ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక లోపలిభాగంలో కళ్యాణం వీక్షించేందుకు పెద్దపెద్ద ఎల్‌ఈడీలను ఏర్పాటుచేశారు. కళ్యాణోత్సవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యలరావు పట్టువస్త్రాలను సమర్పించ నున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. నొప్పి పెరగటంతో వైద్యుల సూచన మేరకు ఒంటిమిట్ట పర్యటనను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు.

TTD made all arrangements for Vontimitta Sita Rama Kalyanam on wednesday

శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. కానీ ఒంటిమట్ట శ్రీ కోదండరాముని కల్యాణోత్సవానికి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేని విశిష్ఠత ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో పండువెన్నలలో రాములోరి కల్యాణం నిర్వహించడం కొనసాగుతోంది. ఇదే సంప్రదాయంలో టీటీడీ కూడా రాములోరి కళ్యాణంకు ఏర్పాటుచేసింది. కల్యాణం ముందు రామాలయంలో ఎదుర్కోలు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను కల్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు.

వైఖానస ఆగమశాస్త్రమ ప్రకారం స్వామి వారి కళ్యాణోత్సవంను టీటీడీ అర్చకస్వాములు చేపట్టనున్నారు. తరతరాలుగా వస్తున్న ఆలయ సంప్రదాయబద్దంగానే రాములోరి కల్యాణం నిర్వహిస్తున్నారు. కల్యాణ ఉత్సవంకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..సౌకర్యాలను కల్పించారు. ప్రసాదాలను పంపిణీ చేసేందుకు విస్తృతంగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. కల్యాణం వేదిక ఎదరుగా ఉన్న అత్యా«ధునిక షెడ్లు, పక్క ఇరువైపుల షెడ్లు ఏర్పాటుచేయడం జరిగింది. అలాగే యాత్రీకులు వసతి సముదాయ మండపంను కూడా ప్రారంభించేందుకు సున్నాహాలు చేస్తున్నారు. కళ్యాణం వీక్షించేందుకు ఎల్‌ఈడీలను ఏర్పాటుచేశారు. టీటీడీ అధికారులు 15 రోజులుగా కళ్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+