TTD: తిరుమలలో ఎన్ని రోజులకు సరిపోయే నీళ్లు ఉన్నాయో తెలుసా ?, భక్తులు !

తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో కొన్నిసార్లు లక్షల మందికిపైగా శ్రీవారి భక్తులు ఉంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. గరుడ సేవ రోజు అయితే సుమారు రెండు లక్షల మందికిపైగా తిరుమల కొండ మీద శ్రీవారి భక్తులు ఉంటారు. తిరుమలలో శ్రీవారి భక్తులు వారి అన్ని అవసరాలు తీర్చుకోవడానికి నీటిని ఉపయోగిస్తుంటారు.

ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120 రోజుల నుంచి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని బుధవారం టీటీడీ తెలిపింది.ఈ మేరకు బుధవారం నాడు తిరుమలలో టీటీడీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.

TTD officials appealed to devotees to use water sparingly in Tirumala

తిరుమలలో ప్రతిరోజు సరాసరి దాదాపు 70 వేల మందికిపైగా నీటిని ఉపయోగిస్తున్నారు కొన్ని సందర్బాల్లో తిరుమలలో లక్ష మందికిపైగా శ్రీవారి భక్తులు నీటిని ఉపయోగిస్తున్నారు. అందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్‌ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాపవినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ తెలిపింది.

అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని టీటీడీ శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది.ఈ మేరకు భక్తులు, స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారని బుధవారం టీటీడీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+