TTD: తిరుమల శ్రీవారి భక్తులకు హై అలర్ట్, ఘాట్ రోడ్డులో ఇలా !!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు వేలాది మంది భక్తులు వెళ్తున్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలో శ్రీవారి భక్తులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతంగా కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తిరుమల కొండల మీద ఉన్న బండరాళ్లు ఘాట్ రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ఈ సందర్బంలో శ్రీవారి భక్తులు చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా సొంత వాహనాల్లో తిరుమల వెళ్లి వస్తున్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీలతో రోడ్డు మీద పడిన కొండచరియలు, బండరాళ్లను పక్కకు తొలగించారు. భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లి వస్తున్న భక్తులు వారి సొంత వాహనాలను జాగ్రత్తగా నడపాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు.

TTD officials were alerted due to a landslide on the Tirumala Ghat road

భారీ వర్షాల దెబ్బతో తిరుమలలో శ్రీవారి భక్తులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి బయట నిలబడటానికి వీలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి ఆలయం ముందు నిలబడి భక్తులు ఫోటోలు తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం అయిన తర్వాత చాలామంది భక్తులు శ్రీవారి లడ్డు కౌంటర్, రాంభగీచ కొరకు పరుగు తీశారు.

దసరా సెలవులు పూర్తి కావడంతో ఆ తరువాత కూడా కొన్ని రోజులు సెలవు పెట్టుకున్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 18 గంటలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 73,891 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,423 మంది శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించుకుని స్వామివారికి మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.53 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+