TTD:భక్తులతో పోటెత్తిన తిరుమల.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్; దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!!

కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరి కొలిచిన వారి కొంగుబంగారంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తిరుమలలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూ లైన్ లలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.

తిరుమలలో స్వామి దర్శనానికిఇన్ని గంటల సమయం
ఇక తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇదిలా ఉంటే బుధవారం రోజు 81,930 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 41,224 మంది తలనీలాలు సమర్పించారని, హుండీలో 3.90 కోట్ల కానుకలు వేసారని పేర్కొన్నారు.

TTD Tirumala devotees rush all compartments full 24 hours for sarva darshan

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మొన్న సర్వదర్శనం కోసం భక్తులకు 18 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా నిన్న 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 41,927 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ పేర్కొంది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లుగా పేర్కొంది. ప్రస్తుతం భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 9-10 గంటల సమయం
ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 గంటల నుంచి పది గంటల సమయం పడుతుందని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. అయితే వేసవి ఆరంభంలో విపరీతంగా ఎండలు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్న క్రమంలో వాతావరణం చల్లబడడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఏర్పాట్లు
ఇక తిరుమలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలన్నీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. తిరుమలలో మున్ముందు భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+