శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్, దర్శనాల్లో కీలక మార్పులు.. తాజాగా..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా టీటీడీ చేసిన ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికే పలు ప్రముఖ గెస్ట్ హౌస్ ల పేర్లను మార్పు చేసారు. తాజాగా తిరుమల వీధుల పేర్లను ఖరారు చేసారు. ఇక.. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు బిగ్ అప్డేట్. ఈ రోజు ఇందుకు సంబంధించి ఆన్ లైన్ టికెట్లను జారీ చేయనున్నారు. భక్తుల రద్దీ, పర్వ దినాల నేపథ్యంలో డిసెంబరు, జనవరిలో పలు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.

తిరుమల క్షేత్రంలోని వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తిరుమలలో కొన్ని వీధుల కు మేదరమిట్ట, ఆర్‌బీ సెంటర్, ముళ్లగుంత వంటి పేర్లు కొన్ని వీధులకు ఉన్నాయి. తిరుమల వంట ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పేర్లు ఉండటంపై చర్చ జరిగింది. దీంతో.. శ్రీవారి పరమ భక్తుల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల శ్రీ అన్నమాచార్యులు, శ్రీ తిరుమలనంబి రోడ్డు, శ్రీ వెంగమాంబ రోడ్డు, శ్రీ పురందరదాసు, శ్రీ అనంతాళ్వార్ రోడ్డు, శ్రీ సామవై రోడ్డు వంటి వంటి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. వీటి పైన టీటీడీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.

TTD to change the names for Tirumala Streets as latest discussions details here

ఇప్పటికే తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీ స్వాధీనం చేసిన విశ్రాంతి భవనాల్లో 42 భవనా లకు దాతల సొంత పేర్లు ఉండగా వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంభందించి 75 పేర్లను సూచించి, వాటిలో ఎదైనా ఒకటి‌ గెస్ట్ హౌస్ కు పేరు గా పెట్టుకోవాలని బోర్డు అదేశించింది. ఇందులో భాగంగానే 42 గెస్ట్ హౌస్ లకు పేర్లు మారాయి. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన కు గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండా లని నిర్ణయం తీసుకున్నారు.

బెంగళూరు వందేభారత్ కు కొత్త హాల్టింగ్స్.. ప్రయాణ వేళల్లో మార్పులు..!!

డిసెంబరు 23వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబరు 29, 30వ తేదీల నుంచి జనవరి 8వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. అలాగే జనవరి 25వ తేదీన రథసప్తమి దృష్ట్యా ప్రోటోకాల్ ప్రముకులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.

కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఈ-డిప్‌ ద్వారా ఇప్పటికే కేటాయించారు. మిగిలిన ఏడు రోజులకు నేటి ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ నుంచి మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+