శ్రీవారి భక్తులకు శుభవార్త... దర్శనం టికెట్లపై ప్రతిరోజు టీటీడీ అప్ డేట్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం ఒక్కటే ప్రస్తుతం అందరిముందు ఉన్న ఏకైక అవకాశం. ఆన్ లైన్ తో సంబంధం లేకుండా ఆఫ్ లైన్ లో టికెట్లు తీసుకొని దర్శించుకోవాలంటే శ్రీవారి సర్వదర్శనం టికెట్లను పొందాలి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు వీటిని ఇస్తుంటారు. తెల్లవారుజామున రెండుగంటలకు టికెట్లను జారీచేస్తారు. ఇకనుంచి ఎన్ని టికెట్లను ఇచ్చారు.. ఇంకా ఎన్ని ఉన్నాయి.. వివరాలతో అప్ డేట్ ను ట్విటర్ లో ఇస్తోంది. ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని తితిదే కోరుతోంది.

రోజుకు 18వేల టికెట్లు
శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి అప్పటివరకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఇంకా ఎన్ని ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఈ మూడు కౌంటర్ల ద్వారా 18వే దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిని చూసుకొని క్యూలైన్ లో ఉండాలా? వద్దా? అనేది భక్తులు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రత్యేక దర్శనం టికెట్లతోపాటు శ్రీవారి సర్వ దర్శనం టికెట్లపై తిరుమల వచ్చేవారు వాటిపై కేటాయించిన సమయానికి మాత్రమే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు కోరారు. అనుకున్న సమయంకన్నా ముందుగా రావడంవల్ల గంటల తరబడి వేచివుండాల్సి వస్తోందన్నారు.

ttd updates every day on ssd tokens in tirumala

తమిళం, కన్నడంలో ప్రకటనలు
తిరుమలకు వచ్చే భక్తుల సమాచారం కోసం తెలుగు, హిందీ, ఇంగ్లిషుతోపాటు కన్నడం, తమిళ భాషల్లో కూడా ప్రకటనలు చేస్తున్నామని, అలాగే తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ తోపాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద కూడా ప్రకటనలు ప్రారంభించినట్లు శ్యామలరావు తెలిపారు. తిరుపతిలో, తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. క్యూలైన్ల బయట వేచివుండకుండా వీటిని సందర్శించడంవల్ల ఆధ్యాత్మికానుభూతి పొందవచ్చన్నారు. అక్టోబరు నాలుగో తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+