ఏపీ పంచాయతీ ఉపఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీ ?
ఏపీలో తాజాగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. 35 సర్పంచ్ పదవులతో పాటు 245 వార్డు సభ్యుల పదవులకు జరిగిన ఈ ఉపఎన్నికల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. ఇందులో అధికార వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ నెలకొంది. అలాగే ఇండిపెండెట్లు కూడా భారీ ఎత్తున సీట్లు దక్కించుకుంటున్నారు. అటు జనసేన కూడా పలుచోట్ల ప్రభావం చూపుతోంది.
పశ్చిమగోదావరి, వైఎస్సార్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, పల్నాడు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ముందంజలో ఉన్నాయి. అయితే ఇరువురికీ మధ్య తేడా చాలా స్వల్పంగా కనిపిస్తోంది. ఆ తర్వాతి స్ధానాల్లో ఇండిపెండెంట్లు, జనసేన, బీజేపీ ఉన్నాయి.

బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికలు కావడం, స్వల్ప ఓట్ల తేడా నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడటానికి చాలా సమయం పడుతోంది. పలుచోట్ల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలు ప్రత్యర్ధులపై పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అలాగే పలు చోట్ల రీకౌంటింగ్ కు డిమాండ్లు చేస్తున్నారు. దీంతో పూర్తి ఫలితాలు రేపటి కల్లా వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications