ఘోరం: 11 మంది బాలికలపై ట్యూటర్ అత్యాచారం

శ్రీనివాస్ అనే వ్యక్తి అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి అనాథలు, నిరుపేద పిల్లలను ఈ ఆశ్రమంలో చేర్చుకుంటారు. ఈ పిల్లలను ఏనెమీదితండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపిస్తారు. బడి తర్వాత సాయంత్రం 3.30కి వారంతా ఆశ్రమానికి తిరిగి వస్తారు. అక్కడ సాయంత్రం పూట వారిని చదివించేందుకు ఏనెమీదితండాకు చెందిన రమావత్ హరీశ్ అనే యువకుడిని శిక్షకుడిగా (ట్యూటర్) నియమించారు. అతను గత ఏడాది జూలై నుంచి అక్కడ పని చేస్తున్నాడు. స్టడీ అవర్‌లో పాఠాలు చెప్పి, అక్కడే భోజనం చేసి హాస్టల్‌లోనే నిద్రిస్తున్నాడు.
ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 34మంది బాలురు, 44 మంది బాలికలు ఉన్నారు. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత నైట్‌వాచ్‌మన్ బాలుర గదిలో నిద్రిస్తుండగా, హరీశ్ మాత్రం బాలికల గదుల్లో పడుకునేవాడు. 10 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను రాత్రివేళలో నిద్రలేపి వారిపై అత్యాచారం జరిపేవాడు.
వంట మనిషి హెచ్చరికతో రాత్రుళ్లు స్టడీ అవర్ ముగియగానే ఆశ్రమంలో పడుకోకుండా వెళ్లిపోవాలని నిర్వాహకుడు శ్రీనివాస్ హరీశ్‌కు స్పష్టం చేశారు. బాలికలు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఇంటర్వెల్ సమయంలో బయటకు రాగానే ఇంటికి పిలిపించుకొని పనులు చేయించుకునే వాడు. తన ఇంట్లోనే వారిపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఓ బాలికపై అతను 36 సార్లు ఆత్యాచారం చేసినట్లు బయటపడింది.
గతనెల 28న హరీశ్ సెలవుపెట్టి సూర్యాపేటకు వెళ్లాడు. ఆ సమయంలో శ్రీనివాస్ పాఠాలు చెప్పేందుకు వచ్చాడు. దాంతో తెగించి బాలికలు హరీష్ విషయం ఆయనకు చెప్పారు. తన భార్య ద్వారా శ్రీనివాస్ బాలికల నుంచి పూర్తి సమాచారం రాబట్టారు. ఎస్‌బీ పోలీసులు జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత మహిళా సీఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు తండాకు వచ్చి 11 మంది బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హరీశ్‌ను సూర్యాపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications