ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై కొత్త ట్విస్ట్..!?

ఏపీలో రాజకీయం వివాదం కొనసాగిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు ను జత చేసింది. దీని పైన రాజకీయంగా వివాదం కొనసాగింది. టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించింది. ఇప్పుడు ఈ పేరు విషయంలో కొత్త చర్చ మొదలైంది. దీని పైన ప్రభుత్వ స్పందన కీలకం కానుంది.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ గా మారుస్తూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పును ఇప్పటి వరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తించిందా లేదా అనేది చర్చకు కారణమవుతోంది. దీనికి సంబంధించి ఒక లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. 2022 నవంబర్ 1న పేరు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నంద్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు..సీట్లకు సంబంధించి లేఖ రాసింది. ఆ లేఖలో ఈ వైద్య కళాశాలలు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. దీనికి కొనసాగింపుగా 150 సీట్ల కేటాయింపుకు అవసరమయ్యే విధంగా ఆ కాలేజీలో వసతులు ఉన్నాయో లేవో చూడాలని సూచించింది.

 healthuniversity-

ఆ లేఖలో గతంలో ఉన్న పేరునే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి అడ్రస్ చేస్తూనే లేఖ రాసింది. ఈ నెల 21న ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీని వైఎస్సార్ వర్సిటీగా మారుస్తూ అధికారికం గా ఉత్తర్వులు జారీ చేసినా నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాత్రం పాత పేరుతోనే లేఖ రాయటంతో ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది.

పేరు మార్పుకు మరింత సమయం పడుతుందా.. లేక, ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన అధికారిక సమాచారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు చేరలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందినా.. కౌన్సిల్ రికార్డుల మేరకు మేరు మార్పు జరగలేదా అనే మరో చర్చ వినిపిస్తోంది. పేరు మార్పు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, ఇందులో కౌన్సిల్ కు సంబంధం ఉండదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+