కూతురిపై మారు తండ్రి రేప్ కేసులో ట్విస్ట్: సహకరించిన తల్లి

 Twist: Step father roes daughter
హైదరాబాద్: మారు తండ్రి కూతురిపై అత్యాచారం చేసిన సంఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిని పెళ్లి చేసుకుని, ఆమె మొదటి భర్తతో కన్న కూతురిపై అత్యాచారం చేశాడని, రెండో కూతురిని లోబరుచుకోవడానికి ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ కేసులో తల్లే తన కూతురిపై అత్యాచారానికి అతనికి సహకరించినట్లు వెల్లడైంది.

బాలికను గర్భవతిని చేసిన మారు తండ్రిని, అందుకు ఆ బాలిక కన్న తల్లిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం గురించి సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం - పట్టణంలోని కింది బస్తీలో శశికళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. హోటల్‌లో పనిచేసే చంద్ర (35) అనే వ్యక్తిని శశికళ వివాహం చేసుకుంది. ఈ స్థితిలో చంద్ర కన్ను ఆమె పెద్ద కూతురి (14)పై పడింది. చంద్ర ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది.

ఇటీవల చంద్ర శశికళ చిన్న కూతురి(11)పై కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ విషయం డిసెంబర్ ఒకటో తేదిన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు చంద్రపై కేసు నమోదు చేశారు. చంద్రకు శశికళ కూడా సహకరించడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి నిందితులిద్దరిని రిమాండుకు తరలించారు.

ఆ బాలికలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ చొరవతో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ పరిధిలో జరిగిందీ సంఘటన. కర్ణాటకకు చెందిన శశికళ (45) అనే వివాహిత తన భర్త మృతిచెందడంతో నాలుగేళ్ల కిందట ఇద్దరు కూతుళ్లతో కలిసి నగరానికి జీవనోపాధి నిమిత్తం వచ్చింది. మేడ్చల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. మేడ్చల్‌లోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఆ పిల్లలు చదువుతున్నారు.

తన తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన అక్కను ఇలాగే కొట్టి లోబరుచుకున్నాడని, ఇప్పుడు తననూ చిత్రహింసలు పెడుతూ అలాగే లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. అవాక్కయిన ప్రిన్సిపాల్‌ వారి ఇంటికి వెళ్లి ఆరా తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+