విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యాబాధితుడి కేసులో ట్విస్ట్: లాయర్‌‌పై నిందలు మోపిన భర్త

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తన భార్య వేధిస్తోందని విజయవాడ కోర్టును ఆశ్రయించిన భర్త కేసులో ట్విస్ట్ చేసుకొంది. తాము రాజీపడి జీవిస్తున్న సమయంలో డబ్బుల కోసమే లాయర్ తమను వేధిస్తున్నాడని కృష్ణా జిల్లా నున్న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన భార్య వేధింపులకు గురిచేస్తోందని రమణ‌కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున మంగళవారం నాడు ప్రచారమైంది. అయితే మంగళవారం రాత్రికి నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి

బెజవాడలో సంచలనం: పెళ్ళైందని ప్రశ్నిస్తే నా భార్య వేధిస్తోంది, కోర్టును ఆశ్రయించిన భర్తబెజవాడలో సంచలనం: పెళ్ళైందని ప్రశ్నిస్తే నా భార్య వేధిస్తోంది, కోర్టును ఆశ్రయించిన భర్త

లాయర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును వేయించారని భార్య, భర్తలు లాయర్‌పై నున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్యపై గృహ హింస కేసు నమోదు చేసిన రమణ కుమార్ కూడ భార్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది.

భార్యపై గృహ హింస కేసులో ట్విస్ట్

భార్యపై గృహ హింస కేసులో ట్విస్ట్

తన భార్య వేధింపులకు గురి చేస్తోందని రమణ కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విజయవాడ కోర్టు విచారణకు స్వీకరించింది. భార్య వేదింపులకు గురి చేస్తోందని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు స్వీకరించడం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా భావిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భార్యభర్తలిద్దరం రాజీపడి బతుకుతున్నప్పటికీ లాయర్ డబ్బుల కోసం తప్పుడు పిటిషన్ వేయించారని నున్న పోలీస్ స్టేషన్‌లో భార్య, భర్తలు ఫిర్యాదు చేశారు.

భార్యతో విభేదాలు నిజమే

భార్యతో విభేదాలు నిజమే

తన భార్యతో విభేదాలు నిజమేనని రమణ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే లాయర్‌ ప్రోద్భలంతోనే తన భార్యపై కేసు పెట్టాల్సి వచ్చిందంటూ బాధితుడు రమణ కుమార్ మంగళవారం రాత్రి ప్లేట్ ఫిరాయించాడు.తన భార్య తనపై పెట్టిన కేసు విషయమై లాయర్ శ్రీనివాసరావును సంప్రదిస్తే లక్ష రూపాయాలను ఫీజు డిమాండ్ చేశారని, అయితే తాను రూ. 40 వేలు చెల్లించినట్టు రమణ కుమార్ చెప్పారు.

కలిసే ఉంటున్నాం

కలిసే ఉంటున్నాం

లాయర్ ను కలిసిన వచ్చిన తర్వాత తామిద్దరం కలిసే ఉంటున్నామని భార్య, భర్తలు చెప్పారు. 20 రోజుల క్రితమే కలిసిపోయినట్టు వారు చెప్పారు. అయితే ఈ విషయాన్ని లాయర్ కు కూడ చెప్పినట్టు వారు చెప్పారు. అయితే మిగిలిన రూ.60వేలు చెల్లించలేదనే అక్కసుతోనే తమ ప్రమేయం లేకుండానే తమ పేర్లను మీడియాకు చెప్పారని భార్య, భర్తలు ఆరోపించారు.

పరువు నష్టం కేసు వేసుకోవాలని సూచన

పరువు నష్టం కేసు వేసుకోవాలని సూచన

ఈ ఘటనతో తమ కుటుంబం పరువు పోయిందని భార్య, భర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాయర్ పై చర్యలు తీసుకోవాలని నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే లాయర్ పై పరుపు నష్టం కేసు వేసుకోవాలని పోలీసులు సూచించినట్టు బాధితులు చెప్పారు.

English summary
New twist in domestic violence case in Vijayawada. Ramanakumar and his wife complained against lawyer srinivasa Rao in Nunna police station on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X