పిక్చర్స్: మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టులు
విశాఖపట్నం: మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరిని విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని బీచ్‌రోడ్డులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మహిళపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అరెస్టు చేసిన ఇద్దరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. సోమవారం రాత్రి బీచ్‌రోడ్డులోని కోస్టల్ బ్యాటరీకి ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై ఎప్పటిలాగే మతిస్థిమితం లేని 35 ఏళ్ల మహిళ నిద్రపోయింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో అక్కడికి చేరుకున్న జాలారిపేటకు చెందిన కొక్కిరి పోలరాజు (30), వాడమేమల పోలయ్య (45), పోలయ్య ్లియాస్ నల్లపాయ మద్యం సేవించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడా్డారు.
ఘాతుకం జరుగుతున్న సమయంలో చూసిన ఆటో స్టాండులోని కొంత మంది పోలీసులకు విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరారైపోతున్న పోలరాజు, పోలయ్యలను పట్టుకున్నారు. గత రెండు రోజులుగా వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితులు పోలీసు విచారణలో చెప్పారు.

బాధితురాలు తాను ఎవరిననే విషయం తెలుసుకోలేకపోతున్నానని ఆయన చెప్పారు. బాధితురాలిది తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి అని తెలుస్తోంది. ఉగాది రోజున ఆమె ఇంటి నుంచి తప్పిపోయిందని చెబుతున్నారు. ఆమెకు వివాహమై ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications