టిటిడిపికి 2 కమిటీలు, వీరే: సైకిల్ ఎక్కనున్న కృష్ణయ్య

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా పార్టీ శాసనసభాపక్ష ఉపనేత ఎల్ రమణ నియమితులయ్యారు. బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని వాగ్దానం చేసిన టిడిపి... దానికి అనుగుణంగా ఆ వర్గానికి చెందిన రమణకు అధ్యక్ష పదవిని కట్ట బెట్టింది.

తెలంగాణలోని ఇతర పార్టీ సీనియర్లకు బాధ్యతలు కేటాయించింది. ఈ కమిటీ వర్కింగ్ అధ్యక్షుడిగా టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు, కన్వీనర్‌గా శాసనసభాపక్ష మరో ఉపనేత మోత్కుపల్లి నర్సింహులును నియమించింది. కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రమేష్ రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వర రావును నియమించగా, టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌ను సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది.

పార్టీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డిని నియమించారు. ఎన్నికల కమిటీ సభ్యులుగా మండవ వెంకటేశ్వర రావు, ప్రకాశ్ గౌడ్, అలీ మస్కతి, పి రాములు, ఏలేటి అన్నపూర్ణమ్మ, రేవంత్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, రావులపాటి సీతారామారావును నియమించారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, ఉమా మాధవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొత్తకోట దయాకర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, అరవింద్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, అల్లాడి రాజకుమార్, సయ్యద్ యూసఫ్ అలీ, పెద్దిరెడ్డి, అరిగెల నర్సారెడ్డి, చిలివేరు కాశీనాధ్, సఫన్‌దేవ్, సాయన్నను నియమించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం తన నివాసంలో ఈ కమిటీలను ప్రకటించారు. ప్రచార కమిటీని కూడా నియమించాల్సి ఉందని, మరో రెండుమూడు రోజుల్లో దానిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఎన్నికల కమిటీ వేస్తున్నామని తర్వాత పూర్తి స్థాయి కమిటీని నియమిస్తామని చెప్పారు. బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య టిడిపిలో చేరితే ఆయనకే ఆ కమిటీ బాధ్యతలు అప్పగిస్తామని ఆయన వెల్లడించారు.

కాగా, మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగే ప్రజాగర్జన సభలో కృష్ణయ్య పాల్గొననున్నారు. తర్వాత హైదరాబాద్‌లో మరో కార్యక్రమం నిర్వహించి అధికారికంగా టిడిపిలో చేరే అవకాశముంది. కమిటీల నియామకం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పార్టీని బిసిలకు కానుకగా ఇస్తున్నానని వారే కాపాడుకోవాలన్నారు. కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు చెప్పారు.

ఎల్ రమణ

ఎల్ రమణ

బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని వాగ్దానం చేసిన టిడిపి... దానికి అనుగుణంగా ఆ వర్గానికి చెందిన ఎల్ రమణకు అధ్యక్ష పదవిని కట్ట బెట్టింది. తెలంగాణలోని ఇతర పార్టీ సీనియర్లకు బాధ్యతలు కేటాయించింది.

ఎర్రబెల్లి దయాకర రావు

ఎర్రబెల్లి దయాకర రావు

తెలంగాణ టిడిపి కమిటీ వర్కింగ్ అధ్యక్షుడిగా టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావును నియమించింది. కమిటీల ఏర్పాటు విషయమై ఎర్రబెల్లి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కమిటీలు వేయడంతో ఆయన చల్లబడ్డారనే చెప్పవచ్చు.

మోత్కుపల్లి నర్సింహులు

మోత్కుపల్లి నర్సింహులు

కన్వీనర్‌గా శాసనసభాపక్ష మరో ఉపనేత మోత్కుపల్లి నర్సింహులును నియమించింది. తనకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వనందుకు మోత్కుపల్లి గతంలో అలక వహించారు. ఆ తర్వాత ఆయన చల్లబడ్డారు.

దేవందర్ గౌడ్

దేవందర్ గౌడ్

కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రమేష్ రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వర రావును నియమించగా, టిడిపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్‌ను సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది.

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ

పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, ఉమా మాధవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొత్తకోట దయాకర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, అరవింద్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, అల్లాడి రాజకుమార్, సయ్యద్ యూసఫ్ అలీ, పెద్దిరెడ్డి, అరిగెల నర్సారెడ్డి, చిలివేరు కాశీనాధ్, సఫన్‌దేవ్, సాయన్నను నియమించారు.

రావుల చంద్రశేఖర రెడ్డి

రావుల చంద్రశేఖర రెడ్డి

పార్టీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డిని నియమించారు. ఎన్నికల కమిటీ సభ్యులుగా మండవ వెంకటేశ్వర రావు, ప్రకాశ్ గౌడ్, అలీ మస్కతి, పి రాములు, ఏలేటి అన్నపూర్ణమ్మ, రేవంత్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, రావులపాటి సీతారామారావును నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+