కానిస్టేబుళ్ల మృతి: 'గే', శారీరక సంబంధం వల్లేనా?
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు నగరంలోని పోలీసు క్వార్టర్స్‌లో కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, వీరేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ మురళీకృ,్ణ ఆదోనీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గన్‌మెన్‌గా పని చేస్తుండేవారు.
సివిల్ కానిస్టేబుల్ వీరేష్ కృష్ణగిరి పోలీసు స్టేషనులో పని చేస్తుండేవారు. కొన్ని రోజులుగా టీ గోకులపాడు పికెటింగులో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసు శాఖకు చెందిన వీరిద్దరు 2013 బ్యాచ్ కానిస్టేబుళ్లు.
ఒకే బ్యాచ్ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలోని పోలీసు క్వార్టర్స్ మొదటి అంతస్తులో మురళీ కృష్ణ నివాసం ఉంటున్నాడు. బాకీ కోసం క్యాంటీన్ నిర్వాహకుడు రాత్రి ఇంటికి వెళ్లగా మురళీ కృష్ణష వీరేష్‌లు విగతజీవుల్లా కనిపించారు.
వీరేష్ ఒంటిపై దుస్తులు లేవు. మురళీ కృష్ణ తల టీవీ స్టాండు కింద ఉంది. చిన్న గిన్నెలో నూనె, లోదుస్తులు ఉన్నాయి. కుడికాలి కింద రివాల్వర్ ఉంది. ఇద్దరి నోట్లో నుండి రక్తం వచ్చింది. పరిశీలిస్తే ఇద్దరి తలలో బుల్లెట్లు దిగిన గాయాలు ఉన్నాయి.

కర్నూలు రేంజ్ డీఐజీ రమణ్ కుమార్, జిల్లా ఎస్పీ రవికృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనమానిస్తున్నారు. మురళీకృష్ణకు ఓ అమ్మాయితో ఈ నెల 31న పెళ్లి నిర్ణయించారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సోమవారం రాత్రి అనుమతి తీసుకొని ఆదోని నుంచి రాగా ఇంతలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారని అంటున్నారు. వీరిద్దరి మధ్యనున్న శారీరక సంబంధమే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
వీరిద్దరూ స్వలింగ సంపర్కులని, తరచూ లైంగిక సంబంధం కోసం కొత్తపేటలోని మురళికి చెందిన ఏఆర్ క్వార్టర్స్‌లో కలిసేవారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇటీవల మురళీకృష్ణకు గోకులపాడుకు చెందిన యువతితో వివాహం కుదిరింది.
దీంతో తమ మధ్య బంధం తెగిపోతుందన్న ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురైన వీరేశ్, మురళీకృష్ణను కలిసేందుకు మంగళవారం కర్నూలు వచ్చి ఉంటారని అంటున్నారు. మురళిని కలిశాక, మరింత ఒత్తిడికి గురైన వీరేశ్ తన వద్దనున్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, దీంతో విచారణలో తమ మధ్య బంధం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో మురళి తను కూడా తుపాకితో కాల్చుకొని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీరేశ్ ఒంటిపై నూలుపోగు లేకుండా పడివుండడాన్ని బట్టి, వీరిద్దరి మధ్య లైంగిక సంబంధాన్ని పోలీసులు రూఢీ పరచుకుంటున్నారు. గదిలో మురళీకృష్ణకు చెందిన పిస్టల్‌లో రెండు రౌండ్లు ఖాళీగా ఉన్నట్లూ గుర్తించారు. వీరిద్దరి మధ్య పెనుగులాట జరిగినప్పుడు తుపాకీ పేలి వీరేశ్ చనిపోయి ఉంటాడని, భయంతో మురళి కూడా కాల్చుకొని చనిపోయి ఉంటాడన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications