పాదచారులపైకి కారు, ఇద్దరు మృతి: బాలిక అదృశ్యం

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం ఒరిసాంజంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. లారీలో జొన్నల లోడ్‌తో వచ్చిన డ్రైవర్లు సూరిబాబు, సూరి టీ తాగేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఇద్దరిని కారు ఈడ్చుకెళ్లడంతో డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రైలుకు తప్పిన ప్రమాదం
ఇదిలావుంటే, రైలు డ్రైవర్ చాకచక్యంతో నెల్లూరు ప్యాసింజర్‌కు పెను ప్రమాదం తప్పిందింది. రైలు వస్తుండటంతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి పట్టాలపై బైక్‌ను వదిలేశారు. దీంతో బైక్‌ను రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌లోని భాగాలు రైలు బ్రేక్ పడే దగ్గర చిక్కుకుపోయాయి. వెంటనే రైలు నిలిపివేసిన డ్రైవర్ జాగ్రత్తగా బైకు భాగాలను తొలగించారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి
కడప జిల్లాలోని తొండూరు మండలం ఘాట్‌లో గురువారం ఉదయం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications