ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ బిగ్ ట్విస్ట్ - కూటమి అలర్ట్.!!

ఏపీలో ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్దమైంది. ప్రచారం ముగిసింది. రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో గెలుపు అధికార కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. కానీ, ఆ పార్టీ మద్ద తు దారుల ఓటింగ్ కీలకంగా మారుతోంది. రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయం.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉత్కంఠ పెంచుతోంది.

హోరా హోరీ పోరు
ఏపీలో రేపు జరగనున్న రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ శాసన మండలి నియోజక వర్గాలకు జరుగుతున్న ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా ఎన్నికల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలన పైన ప్రజాభిప్రాయం స్పష్టం చేయనున్నాయి. కాగా, ఈ ఎన్నికలను కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవాలనే లక్ష్యం తో సీఎం చంద్రబాబు, లోకేష్ పలు సమీక్షలు చేసారు. డిప్యూటీ సీఎం పవన్ కూటమి అభ్యర్ధుల ను గెలిపించాలని సందేశం ఇచ్చారు.

Two Graduate and teacher MLC Elections becoming big test for NDA party leaders

వైసీపీ మద్దతుదారుల ఓటింగ్
ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. కానీ, వైసీపీ మద్దతుదారులుగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వామపక్షాల మద్దతుతో గ్రాడ్యుయేట్ సీట్లను దక్కించుకుంది. ఇప్పుడు కూటమి వర్సస్ పీడీఎఫ్ గా మారిన రెండు నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతు ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వీరి మద్దతు కోసం పీడీఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది. మూడు పార్టీల కూటమి 2024 ఎన్నికల్లో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్న ఉభయ గోదావరి - క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో క్లీన్ స్పీప్ చేసింది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో.. కూటమి ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. గెలుపే ప్రామాణికంగా మూడు పార్టీల నేతలకు బాధ్యతలు అప్పగించారు.

మారుతున్న లెక్కలు
ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పరులు పీడీఎఫ్ అభ్యర్ధులకే మద్దతు ఇస్తున్నట్లు పలు ప్రాంతాల నుంచి సమాచారం అందుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి ఏపీటీఎఫ్ కు మద్దతు ఇస్తోంది. కొందరు బీజేపి నాయకులు మాత్రం పీఆర్​టీయూ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. ఉమ్మడి గోదావరి పట్టభద్రుల బరిలో 35 మంది, కృష్ణా-గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాం ధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలిపించే విధంగా సాగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల నేతల కు సవాల్ గా మారుతున్నాయి. ఎవరికి వారు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో, తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+