ప్రేమ వ్యవహారం?: అన్నదమ్ముల సజీవ దహనం
తూర్పుగోదావరి: కాకినాడ శంకరవరం దళితవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు అన్నదమ్ములు దాక్కున్న ఇంటికి నిప్పటించి సజీవదహనం చేశారు. తీవ్ర గాయాలతో బాధితులు మృతి చెందారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతులను బత్తిన నూకరాజు, ప్రసాద్‌గా గుర్తించారు. కాగా, గతంలో జరిగిన ప్రేమ వివాహం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మృతుడు నూకరాజు ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ విషయమై సుధాకర్ అనే వ్యక్తికి నూకరాజుకు ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రసాద్‌తో కలిసి నూకరాజు.. సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ములపై కక్ష పెంచుకున్న సుధాకర్ గురువారం వారి ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
ఘటనలో ప్రసాద్, నూకరాజులు ఇంటితో పాటు కాలిబూడిదయ్యారని పోలీసులు తెలిపారు. దాదాపు ఆరుగురు వ్యక్తులకు ఘటనలో ప్రమేయముందని తెలిసింది. నిందితుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications