ఏపీలో కలకలం.. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అరెస్ట్ !
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే విజయనగరంలో డమ్మీ బ్లాస్టింగ్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఏపీలో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈరోజు ( జూలై 1, 2025 ) మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాయచోటి పట్టణంలోని ఓ ఇంట్లో దాగి ఉన్న ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.

అరెస్టయిన ఉగ్రవాదులు ఎవరు అంటే..
అరెస్టయిన వారిని నాగూర్‌కు చెందిన అబూబక్కర్ సిద్దీక్క్.. తిరునెల్వేలి జిల్లా మేళపలయం ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ గా గుర్తించారు. ఈ ఇద్దరూ దశాబ్దాలుగా పలు ఉగ్రవాద చర్యల్లో నేరుగా పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ సుదీర్ఘకాలంగా భద్రతా ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా ఉన్నట్టు స్పష్టం చేశారు. వీరిద్దరూ దాదాపు 1995 నుంచి 2013 వరకూ పలు చోట్ల బాంబు పేలుళ్లు, రాజకీయ హత్యలు, కుట్రలు, సంస్థాగత విధ్వంస కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరిపై నమోదైన ముఖ్యమైన కేసులు..
అబూబక్కర్ సిద్దీక్క్ పై నమోదైన కేసులు..
1995 చెన్నై చింతాద్రిపేట బాంబు పేలుడు - హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేల్చిన కేసు
నాగూర్ పార్శిల్ బాంబ్ పేలుడు - తంగం అనే మహిళ మృతిచెందిన సంఘటన
1999లో తమిళనాడు, కేరళ, కోయంబత్తూర్, తిరుచ్చి, చెన్నైలో 7 చోట్ల బాంబు పేలుళ్లు
చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబు ప్లాన్
2011 మధురైలో ఎల్‌కే అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబ్ కుట్ర
2012 వెల్లూరు - డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య
2013 బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు
మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ పై నమోదైన కేసులు..
1999లో తమిళనాడు, కేరళలో బాంబుల సంస్థాపనలో పాత్ర
26 ఏళ్లుగా పరారీలో ఉన్న ఉగ్రవాది
అతనిపై పలువురు ఐబీ అధికారుల అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జాడ తెలియలేదు.
కాగా గూఢచారి సమాచారంతో తమిళనాడు ATS స్పెషల్ టీం గోప్యంగా గాలింపు చేపట్టి, స్థానిక పోలీసుల సహకారంతో వీరిద్దరినీ పకడ్బందీగా అదుపులోకి తీసుకుంది. రాయచోటిలో వీరు నకిలీ పేర్లతో ఉండటం, సాధారణ జీవితాన్ని అనుసరిస్తుండటం వల్ల భద్రతా వ్యవస్థకు ఎవరూ గమనించలేకపోయారని చెబుతున్నారు. అయితే ఇటీవల ఇంటెలిజెన్స్ విభాగానికి వచ్చిన లీడ్స్ ఆధారంగా వారి గమ్యస్థానం ట్రాక్ చేసి పట్టుకున్నారు. వీరిని తమిళనాడులో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు.
ఈ అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ భద్రతా వ్యవస్థపై కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఉగ్రవాదులు రాయచోటిలో ఇంత కాలం ఎలా తలదాచుకోగలిగారు? నకిలీ పత్రాలతో నివాసం ఉంటే, స్థానిక పరిపాలనా వ్యవస్థ ఏమి చేసింది? రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ముప్పు ఉందా? వంటి విషయాలు ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్, పోలీస్ విభాగాలకు సవాలుగా మారాయి. విచారణలో ఈ ఇద్దరికి సంబంధించి మరిన్ని గూఢచార చర్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications