డాక్ యార్డ్‌లో విషాదం: షెల్డర్ కూలి ముగ్గురు మృతి
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరంలోని నేవీ డాక్ యార్డు వద్ద విషాదం చోటు చేసుకుంది. బస్సు షెల్టర్ కూలి ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మల్కాపురం సమీపంలోని విజయనగర గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో ఇద్దరు నేవీకి చెందిన వారు ఉండగా, ఒకరు కూలి అని తెలుస్తోంది.

ఆర్కేబీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి
విశాఖ ఆర్కే బీచ్‌లో మంగళవారం గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మురళీనగర్‌లోని అయ్యప్పకాలనీకి చెందిన షమిమ్‌తో పాటు మరో విద్యార్థి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం లింగమనల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారు బళ్లారి వాసులని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications