దారుణం: మహిళలను వివస్త్రలను చేసి చిత్రహింసలు

Two women allegedly beaten up by some villagers
మెదక్: జిల్లాలోని హత్నూర మండలంలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడి కుటుంబసభ్యులైన ఇద్దరు మహిళలపై హతుడి కుటుంబీకులు దుర్మార్గానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళలను నడివీధిలో వివస్త్రలను చేసి చిత్రహింసలకు గురి చేశారు. వారి జుట్టును కత్తిరించి అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. హత్నూర మండలం కొన్యాల గ్రామంలో జులై 12న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 7న కొన్యాల గ్రామంలో బడంపేట నర్సింహులు(40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులైన చాకలి అశోక్, ఆగమయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వారు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. హతుడు నర్సింహులు కుటుంబం నుంచి ముప్పు ఉండటంతో గ్రామానికి రాకుండా దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో అశోక్ బంధువులైన ఇద్దరు మహిళలపై నర్సింహులు కుటుంబసభ్యులు జులై 12న సాయంత్రం 6గంటల సమయంలో దాడి చేశారు. వారిని ఇంట్లోంచి లాక్కొచ్చి గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద పైపులకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. బాధిత మహిళలు దాహం వేస్తుందని అడిగితే వారి నోట్లో మూత్రం పోశారు.

ఆ తర్వాత వారిని వివస్త్రలను చేసి.. జుట్టు కత్తిరించారు. కాగా, ఈ దుర్మార్గాన్ని గ్రామస్తులెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధిత మహిళలను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లనివ్వలేదు. ఆగస్టు 13న బాధిత మహిళలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో స్థానిక పోలీసులను కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+