పాతబస్తీలో దారుణం: మహిళల గొంతు కోశారు(పిక్చర్స్)

హైదరాబాద్: పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. డబీల్ పురా పోలీసు స్టేషన్లో రౌడీషీటర్‌గా నమోదైన సయ్యద్ అలీ అసారత్ భార్య సమీనా ఫాతిమా ఖాతూమ్, అతని అక్క కూతురు సైదా దయానీ హత్యకు గురయ్యారు. హత్యకు పాతకక్షలా మరేమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

పాతబస్తీలో ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ప్రజలు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. కాలికబర్ ప్రాంతంలోని ఆగా టవర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అయిన సయ్యద్ అలీ అసారత్ కుటుంబ నివాసముంటోంది. సయ్యద్ అలీ అసారత్ సౌదీ అరేబియాలో ఉంటున్నాడు.

బుధవారం ఇంట్లో సయ్యద్ అలీ అసారత్ భార్య సమీన ఫాతిమా (50), అత్త సకీన(70), కూతురు సింజాలి(17), సమీన ఫాతిమా సోదరి కూతురు దానియా (17) ఉన్నారు. సకీనా తన మనువరాలు సింజాలిని ఉదయం 8 గంటలకు కాలేజీకి తీసుకెళ్ళింది. ఆమె తిరిగి 9-30 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంట్లో ఉన్న సమీనా ఫాతిమా, సయిదా దానియా హత్యకు గురై రక్తం మడుగులో పడివున్నారు.

దీన్ని చూసిన సకీనా కేకలు వేయడంతో ఫ్లాట్‌లో ఉన్న వారందరూ వచ్చి చూడగా ఇద్దరు మరణించి ఉన్నారు. స్థానికులతో సమాచారమందుకున్న మీర్‌చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విషయం ఉన్నతాధికారులకు సమాచారమందించారు. వెంటనే డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ఫ్రింట్, క్లూస్‌టీం అధికారులు ఇంట్లోని రెండు గదులను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జంట హత్యలు

జంట హత్యలు

హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు.

 జంట హత్యలు

జంట హత్యలు

బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. డబీల్ పురా పోలీసు స్టేషన్లో రౌడీషీటర్‌గా నమోదైన సయ్యద్ అలీ అసారత్ భార్య సమీనా ఫాతిమా ఖాతూమ్, అతని అక్క కూతురు సైదా దయానీ హత్యకు గురయ్యారు.

 జంట హత్యలు

జంట హత్యలు

హత్యకు పాతకక్షలా మరేమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. జంట హత్యలపై అన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జంట హత్యలు

జంట హత్యలు

ఇంట్లో నలుగురు ఉండగా ఇద్దరు బయటకు వెళ్ళిన తర్వాత నిందితులు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు. నిందితులు పరిచయస్తులా లేక ఇంట్లో ఎలా ప్రవేశించారు.. వెనుక తలుపు తెరిచి ఉండటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+