కేంద్రం శుభవార్త... ఏపీలో కొత్త రైల్వే లైన్, 9 స్టేషన్లు

కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వాలే ఉండటంతో ఏపీ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధులను సమీకరిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రేపో మాపో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలంటే రైల్వే లైను తప్పనిసరి అని భావిస్తోంది. అందుకనుగుణంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది.

నంబూరు దగ్గర కలుస్తాయి
కృష్ణా జిల్లాలోని ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు రైల్వేలైనుకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది. మొత్తం 57 కిలోమీటర్ల మేర బ్రాడ్ గేజ్ లైను నిర్మిస్తారు. ముందుగా సింగిల్ లైన్ నిర్మిస్తామని రైల్వేశాఖ అంటుండగా, ఒకేసారి డబుల్ లైన్ నిర్మించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయబోతున్నారు. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ మార్గంలో మొత్తం కొత్తగా 9 రైల్వేస్టేషన్లు వస్తాయి. పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఉంటాయి. అమరావతి ప్రధాన స్టేషన్ గా అభివృద్ధి చేస్తారు. నంబూరు దగ్గర విజయవాడవైపు, గుంటూరువైపు లైను కలుస్తుంది.

union government good news for ap government construction of new railway line in ap

ప్రాజెక్టు వ్యయం రూ.2600 కోట్లు
రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఏపీకి చెందిన ఎంపీలతో సమావేశమయ్యాయి. తర్వాత మీడియాలో సమావేశంలో జీఎం పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 73 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడంతోపాటు విజయవాడ రైల్వే స్టేషన్ ను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది కొత్తగా 36 కొత్త రైళ్లను ప్రవేశపెట్టగా అందులో ఆరు వందేభారత్ రైళ్లు ఉన్నాయని జీఎం అన్నారు. అమరావతి రైల్వే లైను నిర్మాణంలో భాగంగా కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతె నిర్మించబోతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2600 కోట్లు అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+