Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమిత్ షా, నడ్డా వరుస భేటీలు - టీడీపీతో పొత్తుపై క్లారిటీ, రోడ్ మ్యాప్ ఫిక్స్..!!

ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కీలకంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన వేళ బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వస్తున్నారు.

రెండు రోజుల పాటుగా వరుసగా ముఖ్య నేతలు పర్యటనలు.. ఏపీ నేతల తో సమావేశం కానున్నారు. సభల్లో పాల్గొంటారు. టీడీపీతో పొత్తు..రోడ్ మ్యాప్ పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Amit Shah Jp Nadda

ఏపీకి అమిత్ షా..నడ్డా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు (ఆదివారం) విశాఖ రానున్నారు. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన గురించి ఈ సభలో వివరించనున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా ను కలుస్తారనే ప్రచారం ఉంది.

కానీ, ఇది పూర్తిగా పార్టీపరమైన సభ అని... అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదని బీజేపీ నేతలు స్పష్టం చేసారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ఈ రోజు మధ్నాహ్నం చిత్తూరు పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్రం ఇంఛార్జ్ లతో సమావేశం అవుతారు. సాయంత్రం శ్రీకాళహస్తిలో జరిగే సభలో పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశం కానున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్తారు.

టీడీపీతో పొత్తు పై క్లారిటీ: ఈ ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు ఒక్క రోజు తేడాతో ఏపీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమిత్ షా ఆంధ్ర సహా నాలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు.శనివారం గుజరాత్‌లోని పటన్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ సభల్లో ప్రసంగిస్తారు. ఆదివారం విశాఖ రావడానికి ముందు తమిళనాడులోని వెల్లూరు సభలో పాల్గొంటారు.

విశాఖలో సభలో పాల్గొన్న తరువాత రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. రాత్రి 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సామవేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరి నేతల టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Amit Shah Jp Nadda

2024 ఎన్నికల రోడ్ మ్యాప్: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో తిరిగి బీజేపీతో పొత్తు అంశం పైన అనేక రకాల ప్రచారం సాగుతోంది. బీజేపీ ఇప్పుడు పవన్ ప్రతిపాదించినట్లుగా టీడీపీ, జనసేనతో కలిసి పొత్తుకు సిద్దం అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నిర్ణయం కోసం చంద్రబాబు ,వపన్ నిరీక్షిస్తున్నారు. చంద్రబాబుతో ప్రతిపాదనలే మినహా పొత్తులపైన నిర్ణయం జరగలేదని తెలుస్తోంది.

ఈ సమయంలో ఇప్పుడు పార్టీ నేతలతో ఇద్దరు నేతలు సమావేశం అవుతున్న వేళ ఏపీలో పొత్తు రాజకీయం..భవిష్యత్ రాజకీయ కార్యాచరణ...బీజేపీ నేతలకు ఎన్నికల రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు. జనసేనతో పొత్తు కొనసాగుతున్న సమయంలో పవన్ రాజకీయ ఆలోచనలు..బీజేపీ వైఖరి పైనా అగ్రనేతలు స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల పర్యటన వేళ..టీడీపీ - బీజేపీ పొత్తు పైన ఖ్లారిటీ రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+