• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి మరోసారి జలక్ -హోదా అంశం తొలిగింపు : ఢిల్లీలో ఏం జరిగింది..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కేంద్రం ఏపీ - తెలంగాణ రాష్ట్రాలతో సమావేశ అజెండాలో మార్పులు చేసింది. కేంద్ర హోం శాఖ 11వ తేదీతో విడుదల చేసిన సమావేవ అజెండాలో నోట్ లో తొలుత ప్రత్యేక హోదాో పాటుగా మరో ఎనిమిది అంశాలను చర్చించేందుకు ప్రతిపాదన చేసింది. దీంతో..ఒక్క సారిగా కేంద్రం నుంచి హోదా పైన చర్చల దిశగా కదలిక వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. వైసీపీ ఎంపీలు సైతం దీని పైన సానుకూలం గా స్పందించారు. కానీ, ఢిల్లీలో ఇంతలోనే సీన్ మారి పోయింది.

హోదా అంశం తొలిగింపు

విభజన చట్టం హామీల పైన ఈ సమావేశం కాదని... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పైన నోడల్ వ్యవస్థగా ఉన్న కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశం కావటంతో...చర్చల అజెండా మార్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం మొదలైంది. దీని పైన తొలుత బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్వీట్ చేసారు. అజెండా అంశాల పైన హోం శాఖ అధికారులతో సంప్రదించినట్లుగా చెప్పుకొచ్చారు.

బీజేపీ ఎంపీలు..టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు తొలి నుంచి హోదా ముగిసిన అధ్యాయమని చెబుతూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు కేంద్ర హోం శాఖ తొలుత విడుదల చేసిన చర్చల అజెండాలో హోదా అంశం రావటంతో వారు వివరణ తీసుకొనే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ఆ తరువాత ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేసారు.

బీజేపీ ఎంపీ క్లారిటీ

అందులో.. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం అంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం.

ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని వాకబు చేస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని తెలిసిందని చెప్పుకొచ్చారు.

ఎక్కడ మార్పు జరిగింది

ఎక్కడ మార్పు జరిగింది

కానీ, ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నా'' అని జీవీఎల్‌ తెలిపారు. దీంతో...సమావేశం కొనసాగిస్తూనే..అంశాలలో మాత్రం మార్పు చేస్తూ హోం శాఖ మరో నోట్ విడుదల చేసింది. ప్రత్యేక హోదా తో పాటుగా... రెవిన్యూ లోటు అంశాలను తప్పించారు.

అయితే, కేంద్రం లో వచ్చిన ఆలోచన ఆ తరువాత రాజకీయ కారణాలతో పక్కన పెట్టారా..లేక, అధికారుల స్థాయిలో జరిగిన నిర్ణయం ఆధారంగా తొలుత అజెండా ఫిక్స్ అయిందా... కేంద్రంలోని పెద్దలు చెప్పకుండానే అజెండా ఫిక్స్ అవుతుందా..ఇలా అనేక విధాలుగా చర్చలకు ఇప్పుడు కేంద్రం రెండు రోజుల్లో...రెండు రకాల అజెండా అంశాలు ఖరారు చేయటం రాజకీయంగా వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు తాజా నిర్ణయం పైన ఏపీ ప్రభుత్వం..ఏపీ రాజకీయ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Centre change the major agenda is to give special categeory status to AP in MOH meeting which to be held on 17th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X