వైసిపి ఎమ్మెల్యేపై రాత్రిపూట దాడి, షాక్‌కు గురైన ప్రజాప్రతినిధి
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనం పైన గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. తలుపుల ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలాయి. వెంటనే ఆయన తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ దాడితో ఆయన షాక్‌కు గురయ్యారు.

తన పైన జరిగిన దాడిపై ఆయన స్పందించారు. తనను నేరుగా ఎదుర్కోలేక తన పైన దొంగచాటుగా దాడికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ తేళాపు, నిందితులపై చర్యల్లో జాప్యం జరిగితే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే ఫిర్యాదు నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications