బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ‌ణికించిన మ‌నోడు.. తెలుగోడు.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి!

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈ పేరు వింటే చాలు.. తెల్ల‌దొర‌ల‌పై తిరుగుబావుటా ఎగుర‌వేసిన తెలుగోడి స‌త్తా గుర్తుకు వ‌స్తుంది. దేశ స్వాతంత్ర్యోద్య‌మానికి ఊపిరిలూదిన పోరాట యోధుడి త్యాగం గుర్తుకువ‌స్తుంది. మ‌ర‌ణానంత‌రం కూడా ఉయ్యాల‌వాడ‌ పోరాట స్ఫూర్తి చిర‌స్మ‌ర‌ణీయం అనే వాస్త‌వం గుర్తుకువ‌స్తుంది. మ‌రి తెలుగోడు మ‌రువ‌లేని ఆ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పోరాట ప‌టిమ‌ను స్వాతంత్ర్య దినోత్స‌వం స‌మీపిస్తున్న వేళ‌.. ఒక్క‌సారి మ‌న‌మూ గుర్తుచేసుకుందామా?!

బ్రిటిష్ పాల‌కుల నిరంకుశత్వాన్ని ప్ర‌శ్నించి.. దేశ ప్ర‌జ‌ల‌ స్వాతంత్య్రం కోసం తిర‌గ‌బ‌డి.. ఉరికొయ్య‌ల‌కు వేళ్లాడిన విప్ల‌వ వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అప్ప‌ట్లో రాయ‌లసీమ జిల్లాలు హైదరాబాద్‌ నవాబుల ఆధీనంలో ఉండేవి. అయితే, కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించిన న‌వాబులు వాటిని బ్రిటీష్‌వారికి ధారాదత్తంగా అప్ప‌గించారు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన‌ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్ద మల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి బ్రిటిష్ ప్ర‌భుత్వం పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు.

Uyyalawada Narasimha Reddy the man who shook the British Empire

వ‌ణికిన బ్రిటిష్ సామ్రాజ్యం..

వారసత్వంగా ప‌న్నులు వ‌సూలు బాధ్యత తాత మ‌ర‌ణం త‌ర్వాత‌ నరసింహారెడ్డి చేతికి వ‌చ్చింది. అయితే, బ్రిటీష్‌ నిరంకుశత్వ పాలనపై ఆగ్ర‌హంతో ఉన్న న‌ర్సింహారెడ్డి తెల్ల‌దొర‌ల‌పై మొదటిసారిగా 1842లో తిరుగుబాటు బావుట ఎగర వేశాడు. ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న‌ కోవెలకుంట్ల తహసీల్దార్‌ను అంత‌మొందించాడు. 1846వ సంవత్సరంలో బ్రిటిష్‌వారి ట్రెజరీపై దాడి చేసి, 805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. నరసింహారెడ్డి తెగింపును చూసి అప్ప‌టి బ్రిటీష్‌ సామ్రాజ్యం గజగజ వణికిపో సాగింది. ఉయ్యాల‌వాడ‌ను పట్టించిన వారికి 10 వేల దినారాలు బహుమతి అందజేస్తామని అప్పటి ప్రభుత్వం రివార్డ్‌ ప్రకటించింది.

కోట గుమ్మానికి 30 ఏళ్ల‌పాటు..

చివ‌ర‌కు సంజామల మండలం జగన్నాథగుట్టపై 1847లో నరసింహారెడ్డి కొంద‌రి న‌మ్మ‌క ద్రోహుల వ‌ల్ల బ్రిటిష్ ప్ర‌భుత్వానికి చిక్కాడు. దీంతో న‌ర‌సింహారెడ్డిని బందిపోటు దొంగ అంటూ 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరి తీశారు. ఉయ్యాల‌వాడ ఉద్య‌మ స్ఫూర్తి ప్ర‌జ‌ల మ‌న‌సులో పోగొట్టి, వారిని భ‌య‌ప‌డేలా చేసేందుకు తెల్ల‌దొర‌లు త‌మ క్రూర‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టారు. న‌ర‌సింహారెడ్డి తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి 30 ఏళ్ల‌పాటు వేలాడదీశారు.

ఆ చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం కాకుండా.. స్వాతంత్ర్య ఆవ‌స్య‌క‌త తెలిసింది. పోరాడితే ఎప్ప‌టికైనా విజ‌యం సాధించి తీరుతాం అన్న భావ‌న పెరిగింది. అలా ఉయ్యాల‌వాడ ప్రాణాలు వ‌దిలిన వందేళ్ల‌కు మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స్వాతంత్య్రం నేటికీ ఉయ్యాల‌వాడ‌ను స్ఫూర్తిగా తీసుకునేలా.. ఆ పేరు తెలుగోడి మ‌న‌సులో నిలిచిపోయేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+