పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు .. హాజరైన వైసీపీ నాయకులు ?
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలుగా మారాయి . స్థానికంగా కలకలం రేపాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇక వేడుకలకు రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయినట్లు సమాచారం.
అయితే ఈ రికార్డింగ్ డ్యాన్సులకు హాజరైన నేతలు ఎవరు .సదరు నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. కార్యక్రమంలో ఐదుగురు యువతులను తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్న ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications