
సడన్ ట్విస్ట్ :కొడాలి నాని తో రాధా ఆకస్మిక భేటీ: మనసు మారిందా..మద్దతు కోసమా ...!
కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. వైసిపిని వీడి టిడిపిలో చేరే విషయంలో సందిగ్దంలో ఉన్న వంగవీటి రాధా తాజాగా గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానితో ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ భేటీ పై రాజకీయంగా విస్తృత చర్చ సాగుతోంది. రాధా గుడివాడ వచ్చి నానితో ఎందుకు భేటీ అయ్యారు. మనసు మారిందా..మద్దతు కోసమా..
మొత్తం ఒకేసారి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నాని తో రాధా భేటీ..
వంగవీటి రాధా ఆకస్మికంగా గుడివాడ వెళ్లి మరీ అక్కడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంతనాలు సాగాయి. రాధా తో పాటుగా కాపు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొనటం మరింత ఆసక్తి కరంగా మారింది. వైసిపి లో ఉండగా రాధా విజయవాడ సెంట్రల్ సీటు కోరారు. అయితే ఆ సీటు ఇవ్వలేమని..మచిలీపట్నం ఎంపీ లేదా మరో సీటు తీసుకోమని వైసిపి సూచించినా..రాధా అంగీకరించలేదు. ఇక, టిడిపిలో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో రాధా వైసిపిని వీడారు.

అదే సమయంలో జగన్ వ్యవహార శైలి పై తీవ్రంగా విమర్శలు చేసారు. ఆ వెంటనే టిడిపి కి చెందిన నేతలు రాధా నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే, అభిమానులు.. శ్రే యోభిలాషుల సూచనల మేరకు రాధా టిడిపిలో చేరిక నిలిచిపోయింది. పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కూడా టిడిపి ఆఫర్ ఇచ్చింది.
మనసు మార్చుకున్నారా..
ఒక వైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న సమయంలోనే వంగవీటి రాధా గుడివాడ వెళ్లి నానితో సమావేశం అయ్యారు. అయితే ఆయన మళ్లీ మనసు మార్చుకుంటున్నారా..లేక గుడవాడ లో నానికి మద్దతు ఇవ్వటం కోసమే ఈ సమావేశం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 24వేలకు పైగా కాపు ఓటింగ్ ఉంది. ఈ సమావేశంలో కాపు నేతలు సైతం హాజరు కావటం ద్వారా ఇది కేవలం నానితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చేందుకే అక్కడి వెళ్లారా అనే చర్చ కూడా సాగుతోంది.
అయితే, స్థానికంగా ఉన్న కాపు నేతలను సమావేశానికి హాజరు కావటంతో నాని తన వంతు ప్రయత్నంగా రాధా తో మంతనాలు సాగిస్తున్నారనే చర్చ మొదలైంది. వైసిపి ని వీడినా రాధా రాజకీయంగా భవిష్యత్ అడుగులు ఎటు వేయాలనే దాని పై మీమాంస లో ఉండ టంతో..నాని చొరవ తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరి..దీని ద్వారా రాధా తమ మనసు మార్చుకుంటారా లేదా అదే నిర్ణయం తో ఉంటారా అనేది చూడాల్సి ఉంది.