వంగవీటి ఆశ నిర్ణయం వెనుక, ఆ పార్టీలోకే ఎంట్రీ - అక్కడ నుంచే పోటీ..!?
వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయంగా కేంద్ర బిందువు అయ్యారు. వంగవీటి తనయగా ఆశా పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా తన తండ్రి మద్దతు దారులతో వరుసగా భేటీలు నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కీలక మంత్రాంగం మొదలైంది. కాగా, ఆశా చేరనున్న పార్టీ... నియోజకవర్గం పైన విజయవాడ కేంద్రంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.
వంగవీటి మోహన్ రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆశా తాజా నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రజాసేవకు పరిమితం అవుతానని వెల్లడించారు. రాధా-రంగా మిత్ర మండలిలో చోటు చేసుకున్న గ్యాప్ కారణంగానే తాను వస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై తాను ప్రజా క్షేత్రంలో ఉంటానని.. రాజకీయాల్ లోకి వచ్చే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని చెప్పారు. భవిష్యత్తులో రాధా-రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి, వారి సలహాలు తీసుకున్నాకే రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇస్తానని చెప్పటం ద్వారా తన లక్ష్యం ఏంటో వెల్లడించారు. తన తండ్రి ఏ కులానికో, మతానికో పరిమితం కాలేదని, ఆయన బాటలోనే తాను కూడా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

కాగా, 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ 2023 లోనే ప్రచారం సాగింది. ఆ సమయంలో ఆశాతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. కాగా.. వంగవీటి రాధ అప్పటికే టీడీపీలో చేరారు. 2019 ఎన్నిక ల సమయంలోనే టీడీపీలో చేరినప్పుడు రాధాకు ఎమ్మెల్సీ హమీ ఉంది. ఇప్పటికీ ఇంకా అమలు కాలేదు. రాధ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. ఇప్పుడు ఆయ సోదరి ఆశా ఎంట్రీ ఇవ్వటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. కాగా.. తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణతో ఉన్న సంబంధంపై ఆమె స్పందించారు. తమ అన్నాచెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఒకే రక్తం పంచుకు పుట్టామని..తమ దారులు వేరైనా మా ఇద్దరి గమ్యం ఒక్కటే అని చెప్పాన ఆశా.. ఆయన సహకారం తనకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ప్రకటించారు.
2014 లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాధాకు 2019 ఎన్నికల్లో సీటు వ్యవహారంలో మొదలైన వివాదం కారణంగా పార్టీ వీడారు. టీడీపీలో చేరారు. దీంతో.. వైసీపీకి వంగవీటి కుటుంబం దూరమైంది. కాగా.. మారుతున్నసమీకరణాల్లో భాగంగా ఆశా కిరణ్‌ను వైసీపీ రాజకీయాల్లోకి దింపుతోందన్న చర్చ వినిపిస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన ఒక వైసీపీ సీనియర్ నేత ఆశా తో కొత కాలంగా రాజకీయంగా చర్చలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆశా ముందుగా రంగా మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత వారి అభిప్రాయాల మేరకు తన రాజకీయ ఎంట్రీ పైన ప్రకట చేసే అవకాశం కనిపిస్తోంది. 2029 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో ఆశా రాజకీయ కార్యాచరణ పైన ఆసక్తి నెలకొంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications