పిఠాపురంలో వర్మ మార్క్ రాజకీయం - పవన్ ‘ఫిక్స్’..!!
పిఠాపురంలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో జనసేన - టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. జనసేనలోనే గ్రూపులు కనిపి స్తున్నాయి. ఇసుక తవ్వకాల వివాదం రచ్చగా మారుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాల పైన తాజా గా వర్మ సీరియస్ కామెంట్స్ చేసారు. దీనికి కౌంటర్ గా జనసేన నేతలు స్పందించారు. క్రమేణా వ్యవహారం వర్మ వర్సస్ జనసేన గా మారుతోంది. ఇప్పుడు ఇదే సమయంలో వర్మ నియోజక వర్గం లో తన పట్టు పెంచుకునేందుకు.. తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.
మారుతున్న లెక్కలు
పిఠాపురంలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. పవన్ కోసం సీటు త్యాగం చేసి భారీ మెజార్టీ కోసం పని చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. పవన్ సోదరుడు నాగబాబు క ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని చేస్తామని ప్రకటించారు. నాగబాబు జనసేన ప్లీనరీ వేదికగా వర్మను ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నాగబాబు నియోజకవర్గంలోకి వచ్చిన సమయంలోనూ వర్మకు ఆహ్వానం లేదు. గత ఏడాది కాలంలో పలు సందర్భాల్లో జనసేన వర్సస్ వర్మ అన్నట్లుగా నియోజకవర్గంలో రాజకీయం కనిపించింది. పవన్ తో మాత్రం వర్మకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. కాగా, నియోజకవర్గంలో జనసేనలో గతంలో వైసీపీలో పని చేసిన కొందరు నేతల చేరిక తరువాత సీన్ మారిపోయింది.

పట్టుబిగిస్తున్న వర్మ
నియోజకవర్గంలో దొరబాబు జనసేనలో చేరటం.. ఆయన మద్దతు దారులకు ప్రాధాన్యత ఇవ్వటం వర్మకు నచ్చటం లేదు. నియోజక వర్గంలో ఇసుక తవ్వకాల పైన వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు రే చీకటి వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇసుక తవ్వకాల పైన పవన్ చెప్పినా ఆదేశాలు అమలు కావటం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి జనసేన నేతలు సీరియస్ గా స్పందించారు. వర్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి తవ్వకాలు జరుగుతున్నాయని కౌంటర్ చేసారు. ఇదే సమయంలో జనసేనలో పాత.. వలస వచ్చిన నేతల మధ్య పోరు కొనసాగుతోంది. రెండు వర్గాలు గా పార్టీ నియోజకవర్గ నేతలు కనిపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇసుక అక్రమాల్లో జనసేన నేతలు ఉన్నారంటూ వర్మ ఫిక్స్ చేస్తున్నారు. ఇది పవన్ కు ఇరకాటంగా మారుతోంది.
పిఠాపురంలో వర్మ నిరంతరం అందుబాటులో ఉన్నారు. ఇప్పటికీ ప్రజలతో మమేకం అవుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, వర్మ జనసేన నియోజకవర్గ నేతల తీరు పైన గుర్రుగా ఉన్నారు. జనసేన ను సందర్బం వచ్చిన సమయంలో టార్గెట్ చేయటం ద్వారా తన పట్టు పెంచు కొనే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి సమస్యగా మారాయి. ఇటు వర్మ నేరుగా ఎవరి పేరు ప్రస్తావన చేయకుండానే తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేస్తున్నారు. పవన్ మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఇదే సమయంలో వర్మ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓపెన్ గా వర్మ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా పవన్ ను ఫిక్స్ చేస్తున్నారనే వాదన మొదలైంది. దీంతో, రానున్న రోజుల్లో పిఠాపురంలో చోటు చేసుకునే రాజకీయం ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications