ఇప్పుడే ఎపి ప్రత్యేక హోదా బిల్లు పెట్టలేం: తేల్చేసిన వెంకయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వాదనలను సమర్థిస్తున్నానని, కానీ ఇప్పుడు హోదాపై బిల్లు పెట్టలేమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గురువారం రాజ్యసభలో జరిగిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు .

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు ఎన్నో అడుగుతున్నారని వెంకయ్య చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు.

Venkaiah Naidu

హైకోర్టు విభజనను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కే కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.

డెబ్బయ్ ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని..ఇప్పటివరకు ఉద్యోగుల విభజన ఎందుకు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజన ఆలస్యమవుతున్నందున తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union minister and BJP senior leaders M Venakaih naidu said that they can not propose bill on special category status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి