ఫర్మానాలు, కొత్త కవిత్వాలు వద్దు: అధిష్టానంపై విహెచ్

పిసిసి అధ్యక్షుడి ఎంపికలో ఫర్మానాలు, కొత్త కవిత్వాలు కట్టిపెట్టాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఐదేళ్లలో పార్టీని బతికించుకోకుంటే తెలంగాణ మరో తమిళనాడు అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కునే ధీటైన నేత పిసిసి అధ్యక్షుడిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు
ఢిల్లీలో కూర్చుని పిసిసి అధ్యక్షుడిని, నాయకులను ఎంపిక చేస్తే కుదరదని, రాష్ట్రానికి వచ్చి అందరితో మాట్లాడి పిసిసి చీఫ్‌ను ఎంపిక చేయాలని ఆయన అన్నారు తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పెత్తనం పెరుగుతోందని, అది ఇలాగే కొనసాగితే కార్యకర్తలు తిరగబడుతారని ఆయన అన్నారు.
పిసిసి చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్యను తొలగిస్తారనే విషయం అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నాల లక్ష్మయ్యపై అనేక ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో పార్టీ ఓటమిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications