జగన్ కేసు: విజయ సాయిని 2గంటలు ప్రశ్నించిన ఈడి

జగన్ ఆస్తుల కేసులోని వాన్‌పిక్ అంశంపై విచారణకు ఈడి ఎదుట విజయ సాయి రెడ్డి హాజరయ్యారు. రెండు గంటల పాటు సాయిని అధికారులు ప్రశ్నించారు. అనంతరం విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు సాయి రెడ్డి మళ్లీ హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడ్జుడికేటింగ్ అథారిటీలో అరబిందో సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్ పైన వాదనలు జరిగాయి.
మరోవైపు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్‌కు చెందిన మొదటి అటాచ్‌మెంట్ పైన అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. రెండు రోజుల క్రితం ఈడి మూడో అటాచ్‌మెంట్ పైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications