అమిత్ షా తో సాయిరెడ్డి భేటీ, కీలక చర్చ - బిగ్ టర్న్..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన వైసీపీ రాజ్యసభలో మాత్రం బలంగా ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీల సంఖ్యా బలం ఉంది. లోక్ సభలో వైసీపీకి నలుగురు సభ్యులే ఉన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

వరుస భేటీలతో
వైసీపీ 2019-24 మధ్య కాలంలో ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా..బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన సమయంలో మద్దతిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏలో రాష్ట్రంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్న టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. అయినా...లోక్ సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. ఇప్పటికీ బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేదు. ఏపీలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీలో జగన్ ధర్నా చేసారు. ఆ ధర్నా సమయంలో ఇండియా కూటమి నేతలు మద్దతుగా నిలిచారు. ఇండియా కూటమిలోకి రావాలని జగన్ ను ఆహ్వానించారు.

Vijaya Sai Reddy meets Amith Shah two times in last four days detail here

మారుతున్న సమీకరణాలు
జగన్ సైతం ఇండియా కూటమి పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీలకు అవసరమైన సమయంలో తాము సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే, కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తో జగన్ సుదీర్ఘ కాలంగా దూరంగా ఉంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల వ్యవహరిస్తున్నారు. జగన్ లక్ష్యంగా షర్మిల రాజకీయం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ తో జగన్ రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రాజకీయ లెక్కలు
వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి వారం రోజుల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వైసీపీకి ఢిల్లీ రాజకీయాల్లో తొలి నుంచి సాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయం వేళ..సాయిరెడ్డి వరుస భేటీల పైన ఆసక్తి కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర అంశాలను ప్రస్తావించినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. అయితే, జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ ఈ భేటీ భవిష్యత్ లెక్కలకు కీలకంగా వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో, సీఎం చంద్రబాబు ఆలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ బేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+