రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ "స్వాతి".. తన సినిమా డైరెక్టర్ తోనే ??
కలర్స్ స్వాతి.. గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. 'కలర్స్' ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత నటిగా మారింది ఈ భామ 'డేంజర్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. 'అష్టాచమ్మా' మూవీతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత కలవరమయే మదిలో, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, బంగారు కోడిపెట్ట, కార్తికేయ, త్రిపుర, లండన్ బాబులు, పంచతంత్రం తెలుగు చిత్రాలతో ఫాలోయింగ్ పెంచుకున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలతోనూ సత్తా చాటింది.
కాగా కెరీర్ పీక్స్‌లో ఉండగానే వికాస్ వాసు అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకున్నారు. 2018 ఆగస్టు పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన ఈమె.. 2023లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ చేసింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించగా.. నవీన్ చంద్ర హీరోగా నటించారు. ఆ సమయంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో భర్తతో ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగించడంతో స్వాతి-వికాస్‌లు విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ వార్తలకు ఆమె ఖండించారు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా తన కమ్ బ్యాక్ మూవీ దర్శకుడితోనే.. స్వాతి రెండోసారి వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. "పెళ్లి చేసుకున్నాం" అంటూ శ్రీకాంత్ నాగోతిని ట్యాగ్ చేస్తూ ఫొటోస్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాగా వికాస్ - స్వాతి విడాకులు తీసుకున్న విషయం ఇంకా బయటకు రాకపోవడం గమనార్హం.
ఇక ఇప్పుడు తన సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ లిస్టులో ఈమె కూడా జాయిన్ అయిందని చెప్పొచ్చు. గతంలో అలా చాలామంది హీరోయిన్లు తమను డైరెక్ట్ చేసిన దర్శకులను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా, అభిమానులు ఈ జంటకు తమ విషెస్ తెలియజేస్తున్నారు. అలానే స్వాతి మళ్లీ వరుస సినిమాలతో బిజీ కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాహం తర్వాత ఆమె సినీ కెరీర్ ఎలా ఉండబోతోందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications