అర్జెంట్ లాక్‌డౌన్.. అర్థరాత్రి యూనివర్సిటీలో కాల్పుల కలకలం!

అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థ వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి వినబడిన తుపాకీ మోతలతో విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి క్యాంపస్‌లోని 'క్వాడ్ అన్నెక్సెస్' సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో క్యాంపస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఆకస్మిక దాడితో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వర్సిటీ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, క్యాంపస్‌ను పూర్తిగా లాక్‌డౌన్ చేశాయి.

అర్ధరాత్రి 1:28 గంటల ప్రాంతంలో బొయిసో వీధిలోని 33000 బ్లాక్ , థర్డ్ అవెన్యూ కూడలి వద్ద ఉన్నట్టుండి ఈ కాల్పుల ఘటన జరిగింది. భయంకరమైన గన్ సౌండ్స్ రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే వర్జీనియా స్టేట్ వర్సిటీ పోలీసులు, చెస్టర్‌ఫీల్డ్ కౌంటీ పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని అత్యవసర వాహనాల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని, ప్రమాదకర పరిస్థితి ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.

Shocking Shooting Near Virginia State University Quad Annexes Leaves Multiple Injured and Campus Locked Down
స్కూల్‌ లో సైకో విద్యార్థి కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
స్కూల్‌ లో సైకో విద్యార్థి కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు

ప్రాంగణం పూర్తి దిగ్బంధం.. విద్యార్థులకు ఆంక్షలు!

కాల్పుల అనంతరం పోలీసులు వెంటనే స్పందించి వర్సిటీ మొత్తాన్ని తమ అదుపులోకి తెచ్చుకుని లాక్‌డౌన్ విధించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ గదుల నుంచి బయటకు రావద్దని, పోలీసుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన వర్సిటీ పోలీస్ విభాగం, ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేసింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

భార‌త్- అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో
భార‌త్- అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో

తప్పించుకున్న దుండగులు.. గాలింపు తీవ్రం!

ఈ రక్తాపాతానికి ఒకరికంటే ఎక్కువ మంది కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దాడికి పాల్పడిన నిందితులు ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు. అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటి? పాత కక్షలేమైనా ఉన్నాయా? లేక కావాలనే భయాందోళనలు సృష్టించేందుకు ఇలా చేశారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+