US-Iran War: ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్ - అవన్నీ ఆయన భ్రమలే..!
ఇరాన్ పై (Iran) ఇంకా ఎంతో కాలం ప్రత్యక్ష యుద్దం చేసే పరిస్ధితి లేకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరోక్ష యుద్దానికి తెరలేపుతున్నారు. ఇన్నాళ్లూ తాను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన హార్ముజ్ జలసంధి (strait of hormuz)ను త్వరలో తమ భూభాగంగా ప్రకటించుకుంటామంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. దీనికి ఇరాన్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ ఇరాన్ కు చెందినదని, అది ఎప్పటికీ ఇరాన్ తోనే ఉంటుందని తేల్చిచెప్పేసింది.
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభంలో తాము మూసేసిన హార్ముజ్ జలసంధిపై ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఇరాన్.. "ఇరాన్ ఆదేశం మేరకు మాత్రమే మూతపడుతుందని, తిరిగి తెరుచుకుంటుందని ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది స్పష్టం చేశారు. ఇరాన్ ఓటమి తర్వాత, హర్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడంపై ఎక్స్ లో ఆయన స్పందిస్తూ.. . హర్ముజ్ జలసంధిని ట్వీట్ ద్వారా గానీ, విమాన వాహక నౌక ద్వారా గానీ, ఆదేశం జారీ చేయడం ద్వారా గానీ, లేదా ఎన్నికల ప్రసంగం ద్వారా గానీ స్వాధీనం చేసుకోలేరని తేల్చిచెప్పారు. వాస్తవాన్ని అంగీకరించాలని, ఇప్పటి వరకు మీరు వ్యూహాత్మక, భారీ ఓటములను చవిచూశారని, ఓటమి వాస్తవాన్ని అంగీకరించి, మీ భ్రమలను విడనాడేంత వరకు, ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని ట్రంప్ కు తెలిపారు.

ఇరాన్‌ను పూర్తిగా ఓడించిన తర్వాత, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన ఆ జలసంధి అయిన హార్ముజ్ ను త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఇరాన్ స్పందన వెలువడింది. హార్ముజ్ జలసంధి గుండా ఓడలు సాధారణంగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చేస్తున్న తప్పుడు వాదనలు అబద్ధాలు, కల్పనలు తప్ప మరేమీ కాదని ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ ఖతమ్-అల్ అన్బియా ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి తెలిపారు. గతంలో మాదిరిగానే, హర్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నిర్వహణ, నియంత్రణలో ఉందన్నారు. శక్తివంతమైన ఇరాన్ సాయుధ దళాల అనుమతి , పర్యవేక్షణ లేకుండా ఏ వాణిజ్య ఓడకు గానీ, ట్యాంకర్‌కు గానీ ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే అవకాశం గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదన్నారు.














Click it and Unblock the Notifications