దొండకాయ టమాటా పచ్చడి ఇలా చేసి చూడండి .. వదిలితే ఒట్టు!

మనం ప్రతీ రోజూ రకరకాల కూరలు వండుకుని తింటాం. ఇదే సమయంలో పచ్డచళ్కాళు కూడా తింటాం. అందులోనూ రోటి పచ్యచళ్లుళు అయితే ఆ రుచే వేరుగా ఉంటుంది. చాలా మంది దొండకాయలు కూరగా వండితే ఇష్టంగా తినరు. అదే పచ్చడి చేసి చూడండి. కచ్చితంగా వదిలిపెట్టకుండా అందరూ తింటారు. మరి దొండకాయ, టమాటాలతో కలిపి పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

దొండకాయలు - 200-250 గ్రాములు ( కట్ చేసుకున్నవి)
టమాటాలు - 2 మీడియం సైజ్ (కట్ చేసుకున్నవి)
ఉల్లిపాయ -- కట్ చేసుకున్న ముక్కలు
వెల్లుల్లి రెబ్బలు - 4-6
పచ్చిమిర్చి - 10
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
చింతపండు - కొద్దిగా
పోపు గింజలు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
ఎండుమిర్చి - 2

Know how to make authentic Andhra-style Dondakaya Tomato Pachadi a spicy tangy and flavorful

తయారీ విధానం

దొండకాయలు కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు ముక్కలు చేసుకోండి. పచ్చిమిర్చి తొడిమలు తీసి పాన్‌లో 3 టేబుల్ స్పూన్ ల నూనె వేడి చేసి అందులో ఈ ముక్కలు అన్నీ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఆపై వాటిని చల్లారనిచ్చి దొండకాయ-టమాటా, పచ్చి మిరపకాయల మిశ్రమం వేసి వాటిని మిక్సీలో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి గ్రైండ్ చెయ్యండి.

బొప్పాయితో బరువుకు చెక్.. షుగర్ కు బెస్ట్, ఇంకా బోలెడు హెల్త్ బెనిఫిట్స్!
బొప్పాయితో బరువుకు చెక్.. షుగర్ కు బెస్ట్, ఇంకా బోలెడు హెల్త్ బెనిఫిట్స్!

ఇలా చేస్తే సూపర్ రుచి

అందులో కరివేపాకు కూడా వేసి బాగా మెత్తగా కాకుండా రుబ్బండి. అందులో ఉల్లిపాయ ముక్కలు కలపండి. ఆపై పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి పోపు చేయండి. అందులో కొత్తిమీర కలుపుకుంటే దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయినట్టే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి దొండకాయ కూర ఇష్టం లేనివాళ్ళు ఇలా దొండకాయ పచ్చడిని ట్రై చెయ్యండి. ఈ పచ్చడి దాదాపు మూడు నాలుగు రోజులు ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+