Poll Tracker: ఈసారి యూపీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు? తేల్చేసిన ఒపీనియన్ పోల్..!
ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో బీజేపీకి చావో రేవో అన్నట్లు మారాయి. కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్ధితుల్లో ఓటర్లు తమవైపే ఉన్నారని చెప్పుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇందులో గెలిస్తేనే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా జరగకపోతే మాత్రం బీజేపీ పతనం ప్రారంభమైనట్లే భావించవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో యూపీ ఓటరు నాడిపై పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ (Opinion Poll)లో సంచలన ఫలితాలు వెలువడ్జాయి.
Poll Tracker Opinion Poll Survey OF Uttar Pradesh Assembly Election 2027
— Poll Tracker (@PollTracker) August 15, 2026
⚫️ पूर्वांचल REGION — TOTAL SEATS: 133
▪️NDA — 56 SEATS | VOTE SHARE: 39%–45%
▪️INDIA — 73 SEATS | VOTE SHARE: 44%–49%
▪️BSP — 3 SEATS | VOTE SHARE: 2%–2.5%
▪️OTHERS — 1 SEAT | VOTE SHARE: 0.5%–1.2%… pic.twitter.com/jJWrQ9nC8S
యూపీలో ప్రాంతాల వారీగా పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలను ఇవాళ సాయంత్రం దశల వారీగా ఎక్స్ లో ట్వీట్లు చేస్తోంది. ఇందులో ముందుగా పూర్వాంచల్ ప్రాంతంలోని 133 సీట్లలో నిర్వహించిన సర్వేలో ఇండియా కూటమికి (India Bloc) 73 సీట్లు, ఎన్డీయేకు (NDA)కు 56 సీట్లు దక్కుతాయని తేలింది. బీఎస్పీకి 3 సీట్లు, ఇతరులకు ఒక సీటు దక్కనున్నాయి. అలాగే అవథ్ ప్రాంతంలోని 82 సీట్లలో నిర్వహించిన సర్వేలో ఇండియా కూటమికి 45 సీట్లు, ఎన్డీయే కూటమికి 35 సీట్లు దక్కుతున్నట్లు తేలింది. బీఎస్సీ 2 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఇండియా కూటమికి 44-49 శాతం ఓట్లు, ఎన్డీయేకు 39-45 శాతం ఓట్లు లభిస్తున్నాయి.

Poll Tracker Opinion Poll Survey OF Uttar Pradesh Assembly Election 2027
— Poll Tracker (@PollTracker) August 15, 2026
⚫️ अवध REGION — TOTAL SEATS: 82
▪️NDA — 35 SEATS | VOTE SHARE: 39%–45%
▪️INDIA — 45 SEATS | VOTE SHARE: 44%–49%
▪️BSP — 2 SEATS | VOTE SHARE: 2%–2.5%
▪️OTHERS — 0 SEAT | VOTE SHARE: 0.5%–1.2%… pic.twitter.com/bLhLkNzEfs
మిగతా ఫలితాలు కాసేపట్లో వెలువడాల్సి ఉంది.














Click it and Unblock the Notifications