Video: రైలులో శోభనం గది? ‘హనీమూన్ కోచ్’ చూశారా!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక విచిత్రమైన వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలపై చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం కార్లు, విమానాలు, లేదా హోటల్ రూమ్‌లను డెకరేట్ చేయడం మనం చూశాం. కానీ, ఒక రన్ అవుతున్న రైలులోని ఏసీ కోచ్ (క్యాబిన్)ను ఏకంగా శోభనం గదిలా మార్చేశారు.
జనరేషన్ మారుతున్న కొద్ది కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతుంటాయి. ఈ తరుణంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ కోసం చాలా మంది దంపతులు.. వివిధ ప్రాంతాలను తమ హనీమూన్ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఉంటారు. వాళ్ల బడ్జెట్ ఆధారంగా అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ జంట తమ తొలి రాత్రిని కదిలే రైలులో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే తన తొలి ప్రయాణాన్ని ఓ రైలులో ఏర్పాటు చేసుకున్నారు.

వేలాది గులాబీలు, మల్లెపూల దండలు, రంగురంగుల బెలూన్లు, క్యాండిల్స్, ఎల్‌ఈడీ లైట్లతో ఆ ఏసీ కోచ్ లోపలి భాగాన్ని అత్యంత విలాసవంతంగా ముస్తాబు చేశారు. గోడలపై 'ఐ లవ్ యూ' అనే అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కోచ్ అలంకరణను చూసిన నెటిజన్లు ఇది ఖచ్చితంగా 'రాజధాని ఎక్స్‌ప్రెస్' అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకు వేసి.. దీని పేరు రాజధాని ఎక్స్‌ప్రెస్ కాదు బాబోయ్.. 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' అంటూ సెటైర్లు వేస్తున్నారు
Rajdhani Express ❌
— Amit (@aiamit1) July 8, 2026
Honeymoon Express ✅ pic.twitter.com/tDPIVNowk4
డెస్టినేషన్ వెడ్డింగ్, హనీమూన్ ప్రయాణాలకు రైల్వే అనుమతిస్తుందా?
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సామాన్య ప్రయాణికుల్లో ఒకటే సందేహం.. "అసలు రైలు కోచ్‌లను ఇలా ప్రైవేట్ వేడుకల కోసం వాడుకోవచ్చా? రైల్వే శాఖ వీటికి పర్మిషన్ ఇస్తుందా?
అవును, ఖచ్చితంగా అనుమతిస్తుంది! భారతీయ రైల్వే (Indian Railways) పెళ్లి బరాత్‌లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కుటుంబ పర్యటనలు, లేదా ప్రత్యేక ఈవెంట్ల కోసం విడిగా పూర్తి కోచ్‌లను లేదా ప్రత్యేక రైళ్లనే బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. దీనిని FTR (Full Tariff Rate) స్కీమ్ అని పిలుస్తారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) పోర్టల్ ద్వారా ఎవరైనా చట్టబద్ధంగా పూర్తి భోగీలను రిజర్వ్ చేసుకోవచ్చు.
డెకరేషన్ రూల్స్ ఏంటి?
రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు బుక్ చేసుకున్న కోచ్‌ను లోపల అలంకరించుకోవచ్చు. అయితే, రైల్వే ఆస్తులకు (సీట్లు, కిటికీలు, ఎలక్ట్రికల్ వైరింగ్) ఎలాంటి నష్టం వాటిల్లకూడదు. అలాగే తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకూడదు. నిప్పుతో కూడిన క్యాండిల్స్ లాంటివి వాడటం రైల్వే భద్రతా నిబంధనల ప్రకారం నేరం (వీటిపై రైల్వే శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది).













Click it and Unblock the Notifications