ఉమా..జగన్‌పై చేతబడి చేస్తున్నావా : లోకేశ్..మీకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది : సాయిరెడ్డి సంచలనం
Recommended Video
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు లోకేశ్.. దేవినేని ఉమా పైన వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మండి పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవీనీతి పైన జగన్ వేసిన మంత్రివర్గ ఉపసంఘం గురించి లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశం..తీసుకున్న నిర్ణయాల పైన దేవినేని ఉమా స్పందించారు. వీరిద్దరూ చేసిన కామెంట్స్ గురించి విజయ సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. అదే సమయంలో వారిద్దరికీ హెచ్చరికలు చేసారు.
లోకేశ్ చిటికెడు మెదడు చిట్లినట్టుంది..
వైసీపీ విజయ సాయిరెడ్డి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను..అదే విధంగా టీడీపీ నేతల విమర్శలకు కొద్ది రోజులుగా ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.1.5 కోట్లు నాకేసిందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం చేయలేదని ఫైర్ అయ్యారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం తొలిసారి వింటున్నామన్నారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేశ్ మీద సాయిరెడ్డి ట్వీట్ చేసారు. మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.. అంటూ మండిపడ్డారు.
దేవినేని ఉమాను వదలకుండా..
ఇక, విజయ సాయిరెడ్డి తన ట్వీట్లలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమా గురించి కామెంట్లు చేసారు. జగన్..కేసీఆర్ మధ్య జరిగిన చర్చల పైన స్పందించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలకు స్పందనగా సాయిరెడ్డి ట్వీట్ చేసారు. అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు.
మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?' అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్ చేసారు. గతంలో ఉమా మీద ఉన్నా ఆరోపణలను సాయిరెడ్డి ఇప్పుడు ప్రస్తావించారు. అయితే, లోకేశ్..దేవినేని ఉమా గురించి ఈ మధ్య కాలంలో సాయిరెడ్డి పదే పదే మీ పాపం పండే రోజు వస్తోంది..మీ పాపాల పుట్ట పగిలే రోజు దగ్గర్లోనే ఉంది కామెంట్ చేస్తున్నారు. దీని ద్వారా అటు కేంద్రంలో..ఇటు ఏపీలో వీరిద్దరి లక్ష్యంగా ఏమైనా విచారణ జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications