Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ పప్పులకే పప్పు, చంద్రబాబువి భ్రమ రాజకీయాలు : తండ్రీ, కొడుకును టార్గెట్ చేసిన సాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి లోకేష్ ను పప్పు అంటూ సంబోధించారు. ఇక చంద్రబాబు సొంత జిల్లాలోనూ , అత్తగారి జిల్లాలోనూ టీడీపీ ఓటమి పాలైందని విమర్శించారు .

 విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం నారా లోకేష్ పిలుపు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం నారా లోకేష్ పిలుపు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమాలు చేస్తుందని ప్రకటించడం, విశాఖ ఉక్కు ఉద్యమంపై టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో పాటు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి లోకేష్ వ్యాఖ్యలకు సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ తాజాగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ గారికి సంఘీభావం తెలిపి , విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఉద్యమబాట కొనసాగిస్తామని చెప్పారు.151 మంది ఎమ్మెల్యేలు,28 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారు అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేశారు .

1978లో విశాఖ ఉక్కు ఉద్యమం .. టీడీపీ పుట్టింది 1982లో చిట్టీ : సాయి రెడ్డి

1978లో విశాఖ ఉక్కు ఉద్యమం .. టీడీపీ పుట్టింది 1982లో చిట్టీ : సాయి రెడ్డి

లోకేష్ వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ వేశారు. లోకేష్ తాను పప్పులకే పప్పు అని నిరూపించుకున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టిడిపి అడ్డుకుందట, ఉద్యమాలు చేసిందట! టిడిపి పుట్టింది 1982లో కదా చిట్టీ? అవునులే మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశాను అని చెప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు 78 లోనే విశాఖ ఉక్కు ఉద్యమం కోసం పోరాడే ఉంటావు అంటూ విజయ సాయి రెడ్డి లోకేష్ ను టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టిడిపి ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు

టిడిపి ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు

ఇదే సమయంలో చంద్రబాబు పై కూడా వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి టిడిపి ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేందుకు భ్రమ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. పచ్చ మీడియాలో ఫేక్ న్యూస్ వేయించినంతమాత్రాన పంచాయితీలు గెలిచినట్లా... మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టిడిపి బలపరిచిన అభ్యర్థి ఓడారు . మీ జిల్లా.. మీ అత్తగారి జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనమే బాబూ అంటూ చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ప్రభుత్వ సంస్థనైనా జగన్ లా నిలబెట్టావా చంద్రబాబూ..

ఒక్క ప్రభుత్వ సంస్థనైనా జగన్ లా నిలబెట్టావా చంద్రబాబూ..

అంతేకాదు ఏపీఎస్ ఆర్టీసీని సీఎం జగన్ మోహన్ రెడ్డి విలీనం చేసి కాపాడారని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో కూడా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు . సీఎం దూర దృష్టి వల్ల ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడిందని, దాదాపు పదిహేను ఏళ్ళ తరువాత లాభాల్లోకి వచ్చిందని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తనవారికి కట్టబెట్టడం కోసం ప్రయత్నించాడని ఆరోపించారు జగన్ గారి ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఏ ఒక్క ప్రభుత్వ సంస్థనైన ఇలా నిలబెట్టగలవా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+