మరాఠీ, దొంగకు తాళాలే: కెసిఆర్‌పై విజయశాంతి ఫైర్

తెరాసకు ఓటేస్తే దొంగకు తాళంచెవి అప్పగించినట్టు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌సభకు పోటీ చేస్తున్న కెసిఆర్‌కు ఓటేయొద్దని కోరారు. ఈ ఎన్నికల్లో పది స్థానాలు మించి గెలుచుకోలేని తెరాస నేతలు అభివృద్ధి మంత్రం వల్లె వేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా తాను తల్లి తెలంగాణ పార్టీని స్థాపించానని, తెరాస విలీనం చేయాలని కెసిఆర్ కోరారని విజయశాంతి వివరించారు. గత ఎన్నికల్లో తాను మెదక్ లోకసభ స్థానానికి నామినేషన్ వేసినప్పటి నుండి పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం ఈ వేదికపై అంతర్గత విషయాలు చెబితే తెరాసను ఖతం చేస్తారని ఆమె అన్నారు.
కెసిఆర్ మహబూబ్‌నగర్‌లో చేసిన అభివృద్ధి శూన్యమని, అందుకే ఈసారి మెదక్ లోక్‌సభను ఎంచుకున్నాడని అన్నారు. తెరాస ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కమలం వాడిపోతుందని, సైకిల్ పంచరవుతుందని, కారుకు యాక్సిడెంట్ కానుందని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications