ఏఐ టెక్నాలజీతో ప్రజల్లోకి - ఎన్నికల వేళ టీడీపీ నేత వినూత్న ప్రయోగం..!!
ఎన్నికల వేళ కొత్త ప్రచార సరళి తెర మీదకు వస్తోంది. ఓటర్లను ఆకట్టుకొనేందకు నేతలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేత కేశినేని చిన్ని ఎన్నిక ప్రచారం కోసం ఏఐ టెక్నాలజీ..సోషల్ మీడియా టూల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి శిక్షణకు శ్రీకారం చుట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ కోసం ఈ ప్రయోగం చేస్తున్నారు. అదే సమయంలో పెరుగుతన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఉపాధి అవకాశాలపైన శిక్షణ కొనసాగిస్తున్నారు.
ఎన్నికలకు సమాయత్తం : ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పార్టీలు క్షేత్ర స్థాయిలో ప్రజలను ఆకట్టుకొనే మార్గాలను అన్వేషిస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని చిన్ని తాజాగా స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో యువతకు సోషల్ మీడియా టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

విజయవాడ లో టీడీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాల్లో చిన్ని వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు రేసులో ఉన్నారు. కేశినేని నాని తీరుతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్ధి పైన చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం కేశినేని చిన్ని పేరు ఎంపీ రేసులో వినిపించింది. ఈ క్రమంలో చిన్ని పార్టీ యాక్టివిటీ పెంచి..ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
వినూత్న ప్రచారం : ఇప్పుడు ఎన్నికల్లో పార్టీ కోసం చిన్న కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా..విజయవాడ పార్లమెంట్ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లు ప్రారంభించారు. ప్రత్యేకించి ఎన్నికల సమాయానికి యువత సేవలను ఆధునిక సాంకేతికత జోడించి పార్టీ కోసం వినియోగించేలా కార్యక్రమాల డిజైన్ చేసారు. దీని ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
వేయి మందికి శిక్షణ ఇవ్వటమే లక్ష్యమని చెబుతున్నారు. సెల్ ఫోన్ వినియోగించి ఏ విధంగా సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సంపాదించుకోవచ్చో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టేవారని..ఇప్పుడు అదే బాటలో తాము యువతకు శిక్షణ అందిస్తున్నామని చెబుతున్నారు.

కొత్త ప్రయోగంతో ప్రజల్లోకి : ఎన్నికల్లో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే అన్ని పార్టీలు ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పాత్ర ప్రముఖంగా పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర సమయంలోనూ యువగళం పైన ఏఐ విధానంలో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేసారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి పార్టీ ప్రచారం..మేనిఫెస్టో ఆకర్షణగా..వినూత్నంగా తీసుకెళ్లే ఆలోచనలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని కోసం ఏఈ వంటి టెక్నాలజీ.. సోషల్ మీడియా టూల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా శిక్షణ అందిస్తున్నారు. ఈ తరహా ప్రచార కార్యక్రమం పైన ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications