జగన్ పార్టీ సభ్యులు లేక! నిద్రస్తోంది: విష్ణుకుమార్ రాజు ఆసక్తికరం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో బోర్ కొడుతోందని, అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో నిద్రొస్తోందని ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

 vishnu kumar raju on assembly sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం మొదలైన సంగతి విదితమే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని అన్నారు.

ఏపీలో పార్టీలు మారిన నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే కనుక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని అన్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని, కేంద్ర వేతన సంఘం నిబంధనల ప్రకారం రోజుకు రూ.448 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Vishnu Kumar Raju responded on assembly sessions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి