జగన్ ఒక్కరే సైనికుడిలా పోరాటం: పార్టీలోకి విశ్వరూప్
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సైనికుడిలా పోరాటం చేస్తున్నారని మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ శుక్రవారం అన్నారు. ఆయన వైయస్ జగన్ సమక్షంలో లోటస్ పాండులో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే స్పష్టమైన పోరాటం చేస్తోందన్నారు. సమైక్యాంధ్రకు జగన్ మొక్కవోని ధైర్యంతో పోరాటం చేస్తున్నారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో తాను సమైక్యాంధ్ర కోసం సుశిక్షిుతడైన సైనికుడిలా పోరాటం చేస్తానన్నారు. విశ్వరూప్‌కు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వరూప్‌తో పాటు పలువురు ఆ పార్టీలో చేరారు.
మళ్లీ రాజీనామా చేస్తా: సాయి ప్రతాప్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్లో చేసిన తన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించడం బాధాకరమని ఎంపి సాయి ప్రతాప్ న్యూఢిల్లీలో అన్నారు. తాను మరోసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. రాజీనామాను ఆమోదించకుంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications