జగన్ దీక్షకు విశ్వరూప్ సంఘీభావం, 18న పార్టీలోకి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ నెల 18వ తేదిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు.
విభజన ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోను ఆగదని చెప్పాకే తాను రాజీనామా చేశానని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ జగన్ ఒక్కరే దీక్ష చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకే మొగ్గు చూపుతోందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం వ్యూహాలనే అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల చర్చలు
సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎపిఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు ప్రారంభించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications