వందే భారత్ సరే... వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి తెలుసా?
అతి తక్కువ సమయంలోనే దూర ప్రాంతాలను చేరుకోవడానికి భారతీయ రైల్వే 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' (Vande Bharat Express) రైళ్లను తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఒక రైలు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య మరో రైలు తిరుగుతుంది. సాధారణ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడుతుంటే వందే భారత్‌లో కేవలం 8 గంటలే పడుతుంది. వందేభారత్ కు ముందే ఉన్న వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి తెలుసుకుందాం.
భారతీయ రైల్వేలో (Indian Railways) అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్స్ ప్రెస్, అస్సాంలోని డిబ్రుఘడ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య నడుస్తుంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 4,218 కిలోమీటర్లు. ప్రతి శనివారం.. డిబ్రుఘడ్ నుంచి ప్రారంభమై సుమారు 80 గంటలు.. అంటే నాలుగు రోజులు ప్రయాణించి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

ఈ రైలు అస్సాం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా ఎనిమిది రాష్ట్రాలగుండా ప్రయాణిస్తుంది. 58 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో ఇంజిన్‌తోపాటు 3 జనరల్ కోచ్‌లు, 11 స్లీపర్ కోచ్‌లు, నాలుగు 3టైర్ ఏసీ కోచ్‌లు, ఒక 2టైర్ ఏసీ కోచ్, ఒక ప్యాంట్రీ ఉన్నాయి. 2011-12 సంవత్సరంలో అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ దీన్ని గురించి లోక్ సభలో ప్రకటన చేశారు. 2013లో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా జనవరి 12న ఈ రైళ్లను ప్రారంభించారు. ఈ రైలు సర్వీసుకు కరోనా సమయంలో బ్రేక్ పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రైళ్ల సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అలా నిలిచిపోయిన చివరి రైలు వివేక్ ఎక్స్ ప్రెస్.












Click it and Unblock the Notifications