Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మృతదేహాల కోసం బంధువుల అంగలార్పు (పిక్చర్స్)

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులు హైదరాబాదులోని నాంపల్లి ఫోరెన్సిక్ లాబొరేటరీ వద్ద గుమికూడారు. ప్రమాదంలో మరణించిన తమవారి మృతదేహాలను అప్పగించాలంటూ వారు డిమాండ్ చేశారు. గురువారంనాడు ఫోరెన్సిక్ లాబొరేటరీ వద్ద మృతుల బంధువులు తీవ్ర ఆందోళనతో కనిపించారు.

ప్రమాదంలో ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా మంటల్లో మడిమసై పోయారు. దీంతో వారిని గుర్తించడానికి డిఎన్ఎ పరీక్షలు అవసరమవుతున్నాయని, డిఎన్ఎ పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని సంబంధిత అధికారులు ఇది వరకే చెప్పారు. అధికారులు 30 మంది రక్తనమూనాలను సేకరించారు.

డిఎన్ఎ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే మృతదేహాలను అప్పగిస్తామని ఫోరెన్సిక్ లాబొరేటరీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించడానికి కనీసం వారం రోజులు పడుతుందని వారు చెబుతున్నారు. పూర్తిగా కాలిపోవడంతో బస్సు లోపల వెనక దాదాపు 20 పుర్రెలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, గాయపడిన ఐదుగురు ప్రయాణికుల్లో ఒక్కరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పట్టరాని రోదనతో...

పట్టరాని రోదనతో...

ఓ మహిళ తనకు సంబంధించిన వ్యక్తి మృతదేహం కోసం ఇలా రోదిస్తూ కనిపించింది. ఫోరెన్సిక్ లాబొరేటరీ వద్ద ఆమెను ఓదార్చడం కూడా గగనంంగా మారింది.

విషాద వాతావరణం...

విషాద వాతావరణం...

నాంపల్లిలోని ఫోరెన్సిక్ లాబొరేటరీ వద్ద విషాద వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు అధికారులు 39 మంది రక్తనమూనాలను సేకరించారు.

నిరీక్షణ తప్పదు..

నిరీక్షణ తప్పదు..

విపరీతమైన విషాదంలోనూ దుఖ్కంలోనూ తమవారి మృతదేహాలను తీసుకోవడానికి నిరీక్షణ తప్పడం లేదు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వద్ద..

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వద్ద..

తమ వారి మృతదేహాల కోసం నాంపల్లిలోని ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వద్ద బంధవులు నిరీక్షిస్తూ కనిపించారు. మృతదేహాలను అప్పగించాలని వారు కోరుతున్నారు.

దుఖ్కం తీరేదా..

దుఖ్కం తీరేదా..

ఈ దుఖ్కం తీరేదానా... ఓ మహిళ తనకు చెందిన వ్యక్తి మృతదేహం కోసం నిరీక్షిస్తూ ఇలా వలవలా ఏడుస్తోంది.

అంతులేని నిరీక్షణ..

అంతులేని నిరీక్షణ..

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయం ఆవరణ మృతుల బంధువులతో నిండిపోయింది. మృతదేహాలను తీసుకోవడానికి వారిది అంతులేని నిరీక్షణగానే కనిపిస్తోంది.

కన్నీరు వరదలై..

కన్నీరు వరదలై..

బస్సు ప్రమాదంలో తమవారిని పోగొట్టుకున్న మహిళ రోదనకు అంతం లేకుండా పోయింది. కన్నీరు వరదలై పారినా కనికరించేవారు లేరు. డిఎన్ఎ పరీక్షలు పూర్తయితే తప్ప మృతదేహాలు వచ్చే అవకాశం లేదు.

సహనం కోల్పోయి..

సహనం కోల్పోయి..

మృతదేహాల కోసం బంధవులు నిరీక్షించాల్సి రావడంతో సహనం కూడా కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇలా...1

జాయింట్ కలెక్టర్ వివరణ..

జాయింట్ కలెక్టర్ వివరణ..

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారిలో 14 మృతదేహాలను డీఎన్‌ఏ ద్వారా గుర్తించాల్సి ఉందని మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.

ఇలా తిప్పలు..

ఇలా తిప్పలు..

మృతుల బంధువులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వద్ద ఇలా తిప్పలు పడుతూ కనిపించారు. వారికి అధికారులు తగిన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తమవారి కోసం ఇలా..

తమవారి కోసం ఇలా..

తమకు చెందిన మృతుల వివరాలను అందిస్తూ మృతదేహాల కోసం ఇలా హైరానా పడుతూ కనిపించారు..

వసతి కల్పన

వసతి కల్పన

దూరం నుంచి వచ్చే మృతుల బంధువులకు వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ఫొటోతో ఇలా

ఫొటోతో ఇలా


బస్సు ప్రమాదంలో ప్రయాణికులు గుర్తు పట్టరానంతగా కాలిపోయారు. అయినా ఆశతో ఫొటోతో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు.

వారంలో రక్తనమూనాలు

వారంలో రక్తనమూనాలు

ఇప్పటి వరకూ మృతుల బంధులవుల నుంచి 28 రక్తనమూనాలు సేకరించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. రక్తనమూనాల ఫలితాలు వారంలో వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మృతుల బంధువులకు సర్ది చెప్పడమే..

మృతుల బంధువులకు సర్ది చెప్పడమే..

మృతుల బంధువులకు సర్దిచెప్పడం కూడా అధికారులకు పెద్ద పనిగా మారింది. మృతదేహాల కోసం వచ్చినవారు ఎవరు ఏ సాయం చేస్తారో చూద్దామని ఇలా..

దండం పెడుతూ..

దండం పెడుతూ..

తమ వద్దకు వచ్చిన అధికారికి దండం పెడుతూ అత్యంత దయనీయమైన స్థితిలో మృతుల బంధువులు ఇలా..

మీడియాతో జాయింట్ కలెక్టర్..

మీడియాతో జాయింట్ కలెక్టర్..

మృతదేహాల స్థితిగతుల గురించి మీడియాకు జాయింట్ కలెక్టర్ విజయరామరాజు వివరించారు. తాము చేస్తున్న ప్రయత్నాలను చెప్పారు.

రక్తం ఇస్తూ..

రక్తం ఇస్తూ..

తమవారిని గుర్తించడానికి డిఎన్ఎ పరీక్షల నిమిత్తం రక్తనమూనాలు ఇస్తూ ఇలా బాధితులు..

బయటకు వస్తూ...

బయటకు వస్తూ...

డిఎన్ఎ పరీక్షల కోసం రక్తనమూనాలు ఇచ్చిన తర్వాత గుండె బరువుతో ఇలా బయటకు వస్తూ కనిపించారు.

రెండు రోజుల్లో కావాలి..

రెండు రోజుల్లో కావాలి..

తమకు మృతదేహాన్ని రెండు రోజుల్లో అప్పగించాలని ఓ వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ విజయరామరాజును డిమాండ్ చేస్తూ ఇలా..

ఉస్మానియా వద్ద దృశ్యం

ఉస్మానియా వద్ద దృశ్యం

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతదేహాలను అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో ఉంచారు. మృతదేహాల వివరాల కోసం ఉస్మానియాలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి దృశ్యం అత్యంత విషాదకరంగా ఉంది.

ఉస్మానియాలో హెల్ప్‌లైన్లు

ఉస్మానియాలో హెల్ప్‌లైన్లు

ఉస్మానియాలో హెల్ప్‌లైన్ నెం : 040 2785 4771,ఓఎస్డీ కమలాకర్ ఫోన్ నెం : 94407 95702. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మృతుల బంధువులకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు.

కర్ణాటక మంత్రి పరామర్శ

కర్ణాటక మంత్రి పరామర్శ

బుధవారం మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువులను ఉస్మానియా ఆస్పత్రిలో కర్ణాటక రాష్ట రవాణమంత్రి రామలింగారెడ్డి బుధవారం పరామర్శించారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

ఇవాళ ఆయన ఆస్పత్రిలో మాట్లాడుతూ వోల్వో బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని కర్ణాటక మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

మృతుల్లో 24 మంది కర్ణాటకవారే..

మృతుల్లో 24 మంది కర్ణాటకవారే..

బస్సు ప్రమాద మృతుల్లో 24మంది కర్ణాటక రాష్ట్రానికి చెందినవాళ్లు ఉన్నారని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+