వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధ ఉన్నా: టిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్య, వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఎపిజెఎఫ్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, విభజనలో తమ పార్టీ భాగస్వామ్యం కావడం బాధాకరమని అయితే, తాము ఇప్పటికీ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

సీమాంధ్రలో సమాంతర రాజధానిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిని కల్పించారని ఆరోపించారు. విభజన జరిగాక తెలంగాణలోని దక్షిణ, ఉత్తర జిల్లాలు సమానంగా ఉంటాయా అని ప్రశ్నించారు. హైదరాబాదు నుండి విడిపోయిన కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు బాగున్నాయా చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

1969, 1972లలోనే రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. డిగ్గీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి నాటకాలు ఆడవద్దని హితవు పలికారు. తమ పార్టీ అధ్యక్షుడు ప్యాకేజీ అడిగితే లెక్కలు తేలీదన్న డిగ్గీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడిగితే మాత్రం నోరు మెదపలేదన్నారు.

వాగ్వాదం

ఎపిజెఎఫ్ సమావేశంలో టిడిపి నేత సోమిరెడ్డి, తెరాస నేత వినోద్ కుమార్, కాంగ్రెసు నేత మల్లు రవిల మధ్య వాగ్వాదం జరిగింది. సోమిరెడ్డి కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేయడాన్ని మల్లు తప్పు పట్టారు. అందరు అభిప్రాయాలు చెప్పాకే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క సీమాంధ్ర వ్యక్తి పైన, ఆస్తుల పైన దాడులు జరగలేదని, విభజన అనివార్యమని, అక్కడి ప్రజలను మోసం చేయవద్దని తెరాస నేత వినోద్ అన్నారు. అయితే బాబు ప్యాకేజీ అడిగితే తేలిదన్న డిగ్గీ కెసిఆర్ ప్యాకేజీ పైన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాము బాబు లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy on Wednesday said they are committed Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X